రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులే కాదు శాశ్వత మాటలు కూడా ఉండవనేవి అక్షర సత్యం.అలాంటి నియమ నిబంధనలకు కట్టుబడితే రాజకీయాల్లో మనుగడ కష్టం.
ఇప్పుడు కావాల్సిందంతా ఏ ఎండకి ఆ గొడుగు… అంతిమంగా కావాల్సింది అధికారం.మిగతా వాటి గురించి ఎన్ని చెప్పుకున్నా… అనవసరమే.
ఏ రాజకీయ పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాదు.ఇప్పుడు కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంది.
ఇక జనసేన వైసీపీ పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి అనేక అనేక ఊహాగానాలు గత కొద్దికాలంగా వస్తూనే ఉన్నాయి.అయితే దీనిపై ఏ పార్టీ క్లారిటీ ఇవ్వలేదు.
ఇంతలోనే పవన్ ఒకడుగు ముందుకేసి తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడంలేదు మేము ఒంటరిగానే ముందుకు వెళ్తామని ప్రకటించేశాడు.
అప్పుడు అలా అన్నా .ఇప్పుడు లెక్కలు మొత్తం మారిపోయాయి.వైసీపీ తో పోత్తుకోసం జనసేన నుంచి ప్రతిపాదనలు వస్తున్నట్టు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పొత్తులపై వైఎస్ఆర్సీ పార్టీ అధినేత జగన్ వద్దకు ఓ రాయబారం వెళ్లినట్టు సమాచారం.చిరంజీవి, బొత్స సత్యనారాయణ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారట.జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ కీలకనేత ఒకరు సన్నిహితుల వద్ద దీన్ని ధృవీకరించారు కూడా.అయితే ఇరువర్గాలు కూడా దీనిపై ఎలాంటి లీకులు రాకుండా ఇప్పటివరకూ జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు.
ఒకవేళ లీకులు వచ్చినా అదంతా తూచ్ అంటూ కొట్టిపారేస్తున్నారు.
అసలు ఏపీలో పవన్ జగన్ కలిసి ఎన్నికలకు వెళ్తే ఎవరికి ఎక్కువ లాభం ఉంటుంది అనే లెక్కలు ఇప్పడు బయలుదేరాయి.
ముఖ్యంగా ఈ పొత్తు కనుక సెట్ అయితే టీడీపీకి కష్టకాలమే .ఎందుకంటే ఇప్పటికే జగన్ రాజకీయంగా టీడీపీని ఎదుర్కొంటున్నాడు.జగన్ కు ఎమ్మెల్యేల బలం తగ్గినా, ప్రజాబలం అనూహ్యంగా పెరిగింది.పవన్ కూడా యాత్రల పేరుతో జనాల్లోకి వెళ్లి హడావుడి చేస్తున్నారు, తన సామాజిక వర్గ ఓట్లను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధం అయ్యాడు.
విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్దా పై జరిగిన దాడి వైసీపీ మైలేజ్ పెంచింది.ఇది పక్కనపెడితే టీడీపీ కాంగ్రెస్గా తో ఇప్పుడు పొత్తు పెట్టుకోవడం మెజార్టీ టీడీపీ అభిమానులే సహించలేకపోతున్నారు.ఈ నేపథ్యంలో జనసేన వైసీపీ పొత్తు పెట్టుకుంటే తప్పేంటి అన్నట్టుగా… ప్రజలు కూడా భావిస్తున్న తరుణంలో బొత్స , చిరు రంగంలోకి దిగడం రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే విధంగా కనిపిస్తున్నాయి.ఈ రెండు పార్టీల మధ్య ముఖ్యంగా సీట్ల బేరమే తెగడం లేదు.
అది కనుక క్లారిటీ వస్తే .టీడీపీ వెనుకబడిపోవడం మాత్రం ఖాయం.