అమెరికాలో చిన్నారుల మధ్య దీపావళి వేడుకలు..

తెలుగువారు ఎంతో మంది అమెరికావెళ్లి స్థిరపడి ఉన్నత స్థానాలకి వెళ్ళినవారే.

అయితే తెలుగు రాష్ట్రాలలో నెలవారీగా వచ్చే పండుగలు కాని సంవత్సరాంతం లో వచ్చే పండుగలని ఏ మాత్రం మర్చి పోకుండా తెలుగుదనం ఎక్కడా పోనివ్వకుండా ఎంతో చక్కగా పండుగలని అందరూ కలిసి చేసుకుంటారు.

తాజా అమెరికాలో స్థిరపడిన వారి పిల్లలకి తెలుగు నేర్పే పాఠశాల లో దీపావళి వేడుకలు నిర్వచించారు.

బే ఏరియాలోని పాఠశాల లో తెలుగు భాషను నేర్చుకుంటున్న చిన్నారులు దీపావళి వేడుకలని ఘనంగా నిర్వహించుకున్నారు.అంతేకాదు దాంతో పాటుగా హలోవిన్‌ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిన్నారులు వివిధ వేషధారణలతో కనిపించి అందరినీ మైమరపింపజేశారు.

దీపావళిని పురస్కరించుకుని చిన్నారులు ప్రమిదలను సొంతంగా తయారు చేసి ప్రదర్శించారు.ఈ సందర్భంగా చిన్నారుల ప్రతిభను అందరూ ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లితండ్రులతోపాటు పాఠశాల టీచర్లు, కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Advertisement

తెలుగు వారు ఎక్కడ ఉన్నా సరే తెలుగు సాంప్రదాయాలకి లోటు రానివ్వకుండా చూడటమే కాకుండా వారి పిల్లలని కూడా ఆ కార్యక్రమాలలో భాగస్వాములని చేస్తున్నారు.

బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?
Advertisement

తాజా వార్తలు