టీడీపీని ఎలాగైనా నిలబెట్టాలి.వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితిలోనూ అధికారంలోకి తీసుకురావాలి.
ఇదీ టీడీపీ అధినేత చంద్రబాబు ముందున్న వ్యూహం.అయితే, దీనికి కలిసివచ్చే నాయకులు ఎవరు ? అనే ఆలోచన చేసినప్పుడు .ఆయనకు కనిపిస్తున్న ప్రధాన వనరు యువతే.వచ్చే ఎన్నికల నాటికి ప్రస్తుత సీనియర్లు పక్కకు తప్పుకొన్నా యువతను రంగంలోకి దింపాలని అనుకున్నారు.
ఈ క్రమంలోనే యువతపై ఆయన చాలానే ఆశలు పెట్టుకున్నారు.వారికి పార్టీలో ప్రధాన్యం పెంచుతానని కూడా బాబు పదే పదే చెబుతున్నారు.
అయితే, ఎప్పటికప్పడు ఆయన ఈ హామీని మరిచిపోతున్నారు.పార్టీకి ఏదైనా ఎదురు దెబ్బతగిలినప్పుడు మాత్రమే బాబుకు యువత గుర్తుకువస్తారనే పేరు సంపాయించుకున్నారు.దీంతో పార్టీలో మాకూ ప్రాధాన్యం ఇవ్వండి సార్.పార్టీ కోసం మేంకూడా చాలానే కష్టపడుతున్నాం.
అనే యువనేతలు చాలా మంది ఉన్నారు.అన్ని సామాజిక వర్గాలకు చెందిన నాయకులు ఈ జాబితాలోనే ఉన్నారు.
అయితే, బాబు హామీలు కోటలు దాటుతున్నాయే తప్ప.కార్యాచరణలో మాత్రం కనిపించడం లేదు.
దీంతో యువ నేతలు ఎక్కడికక్కడ జావగారిపోతున్నారు.

ఇక, తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకువచ్చి.తమ తర్వాత తమ పదవులను, రాజకీయాలను వారికి అప్పగించాలని భావించిన నాయకులు బాబు వైఖరితో దారితప్పుతున్నారు.పైగా టీడీపీలో చంద్రబాబు తర్వాత మరోనే తకూడా కనిపించడం లేదు.
దీంతో వారంతా తమ పిల్లలను వైసీపీ బాటలో పెడుతున్నారు.ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం.
తన కుమారుడు వెంకటేష్‌ను వైసీపీలోకి చేర్చారు.తాజాగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తన ఇద్దరు కుమారులను కూడా పార్టీ మార్చి.
వైసీపీ గూటికి పంపారు.

ఇక, అనంతపురం జిల్లాకు చెందిన కీలక నాయకురాలు కూడా తన కుమారుడిని బీజేపీలోకి పంపాలని కొన్నాళ్లుగా చూస్తున్నారు.ఈ పరిణామాలను సీనియర్లు సమర్ధించుకుంటున్నారు. బాబుపై ఆశలు సన్నగిల్లాయని.
అందుకే సీనియర్లు తమ పిల్లలను వైసీపీలోకి చేర్చేస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.మరి ఇప్పటికైనా బాబు యువతను పట్టించుకుంటారో.
లేక పోతేపోనీ అని వదులుకుంటారో చూడాలి.