చిన్నారి వైద్యానికి ఆర్థిక సాయం అందించి అండగా నిలిచిన చల్మెడ.

రాజన్న సిరిసిల్ల జిల్లా: అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి తన వంతు ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు( Chalmeda Lakshmi Narasimha Rao ).వివరాల్లోకి వెళ్ళితే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వేములవాడ అర్బన్ మండలంలోని గుర్రంవాని పల్లెలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

 Chalmeda Who Stood By By Providing Financial Assistance For The Child's Trea-TeluguStop.com

ఈ క్రమంలో గ్రామానికి చెందిన వంగపల్లి లక్ష్మీ( Vangapalli Lakshmi ) అనే మహిళ తన మనవడు అనారోగ్యంతో బాధపడుతున్నాడనే విషయాన్ని ప్రచారంలో ఉన్న చల్మెడ దృష్టికి తీసుకువెళ్లింది.వెంటనే స్పందించిన లక్ష్మీ నరసింహా రావు, జడ్పీ చైర్ పర్సన్ అరుణ-రాఘవ రెడ్డితో కలసి లక్ష్మీ ఇంటికి వెళ్లి చిన్నారి ఆరోగ్య స్థితిని చూసి చలించిపోయారు.

తక్షణ సాయం కింద ఆర్థిక సాయం అందించారు.రాబోయే రోజుల్లో చిన్నారి మెరుగైన వైద్యం కొరకు తన వంతు సహకారం ఉంటుందని, దైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.

వారి వెంట సర్పంచులు లక్ష్మారెడ్డి, స్వయంప్రభ, మహిళ నాయకురాలు కొమురవ్వ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube