టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రానా పెళ్లి అయ్యింది.నిన్న రాత్రి సాంప్రదాయబద్దంగా మిహికా బజాజ్ మెడలో హిందూ ధర్మం ప్రకారం తాళి కట్టి భర్త అయ్యాడు.
ఆమెను తన భార్యగా స్వీకరించాడు.వీరి పెళ్లి భారీగా జరగబోతుంది కాని అతిథులు మాత్రం కేవలం 30 మంది మాత్రమే అంటూ మొదటి నుండి సురేష్‌బాబు చెబుతూ వచ్చారు.
పెళ్లి పేరుతో కరోనా వైరస్‌ను వ్యాప్తి చేయడం ఇష్టం లేదు అంటూ ఆయన పేర్కొన్నాడు.అన్నట్లుగానే ఆయన 30 మంది కుటుంబ సభ్యులతో పెళ్లి కానిచేస్తాడనుకున్నారు.
కాని రానా సర్కిల్ చాలా పెద్దది కదా.అందుకే అనుకున్న దాని కంటే చాలా మంది ఎక్కువగానే వచ్చారని తెలుస్తోంది.
టాలీవుడ్ నుండి పెద్దగా ఎవరిని పిలవలేదు.అయితే రానాకు ఆప్తులు అయిన రామ్ చరణ్ దంపతులు అల్లు అర్జున్ వివాహంకు హాజరు అయ్యాడు.వారికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చూడవచ్చు.ఇంకా కొందరు టాలీవుడ్‌కు చెందిన వారు వచ్చారు.
ఇక నాగచైతన్య సమంతలు దగ్గుబాటి వారి కుటుంబంకు చెందిన వారే అవ్వడంతో వారు పెళ్లికి హాజరు అయ్యి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.మొత్తంగా 150 మందితో ఈ పెళ్లి జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది.

ఎంతో వైభవంగా జరిగిన ఈ పెళ్లికి సినీ ప్రముఖులు కొందరు హాజరు కాలేక పోయినా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.మహేష్‌బాబు నమ్రత బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఇలా ఎంతో మంది రానాకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా టైం కాకుంటే పెళ్లి దద్దరిల్లి పోయేది.వందల మంది సెలబ్రెటీలతో రానా వివాహం కన్నుల పండుగ అయ్యేది అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.