రష్యా కరోనా వ్యాక్సిన్ ఆగస్టు నెలలో తీసుకొస్తున్నట్లు తెలిపింది.ఈ మేరకు తేదీని ఖరారు చేసింది.
వ్యాక్సిన్ కు సంబంధించి ఈ నెల 12వ తేదీన రిజిస్ట్రేషన్ చేయించుకోబోతుంది.రిజిస్టర్ అయిన మరుక్షణం వ్యాక్సిన్ ను మొదట దేశంలోని 1600 మంది వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ముసలివారికి అందజేయనుంది.
ఆ తర్వాత దేశంలోని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న కరోనాపై పోరాటం చేయడానికి అన్ని దేశాలు వ్యాక్సిన్ ను తయారు చేయడంలో బిజీ అయ్యారు.
ఇప్పటి వరకు అన్ని దేశాలు ఆయా సమయం వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని ప్రకటించుకున్నారు.అయితే, రష్యా కూడా ఈ నెలలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని మొదట్లోనే పేర్కొంది.
అయితే ఆ వ్యాక్సిన్ పై అందరిలోనూ అనుమాలు వెలువెత్తుతున్నాయి.
ఎందుకంటే కరోనాను క్యూర్ చేసే లక్షణాలు ఇందులో ఉన్నాయా లేవా అని తెలుసుకోకుండా, ట్రయల్స్ నిర్వహించకుండానే వ్యాక్సిన్ ను విడుదల చేస్తున్నారని ప్రపంచదేశాలు ఆరోపిస్తున్నాయి.
కానీ, రష్యా వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా.వ్యాక్సిన్ తప్పకుండా సక్సెస్ అవుతుందని రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రష్యా రిలీజ్ చేసే వ్యాక్సిన్ కరోనాపై ప్రభావం చూపినట్లయితే కరోనాకు విరుగుడు దొరికినట్లేనని పలువురు తెలుపుతున్నారు.కాగా, అమెరికా కూడా సెప్టెంబర్ లేదా నవంబర్ నాటికి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.