మన శరీరానికి కావాల్సిన అత్యంత ముఖ్యమైన పోషకాల్లో `కాల్షియం` ఒకటి.అయితే వయసు పెరిగే కొద్దీ శరీరంలో కాల్షియం లోపం ఏర్పడటం సర్వ సాధారణం.
కానీ, నేటి కాలంలో చాలా మంది అతి తక్కువ వయసులోనే కాల్షియం లోపంతో బాధ పడుతున్నారు.కాల్షియం లోపం ఏర్పడితే ఎముకలు అతి త్వరగా విరగడం, ఫెళుసుగా మారటం జరుగుతుంది.
అలాగే కీళ్ల నొప్పులు, అధిక రక్తపోటు, కాలు మరియు చేతి నరాలు తరచూ లాగడం, గుండెకొట్టుకునే వేగంలో మార్పు రావడం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి.
అందుకే కాల్షియం లోపాన్ని నివారించుకోవడం చాలా అవసరం.
అయితే కొన్ని కొన్ని ఆహారాలు తీసుకుంటే కాల్షియం కొరతకు సులభంగా చెక్ పెట్టవచ్చు.మరి ఆ ఆహారాలు ఏంటో చూసేయండి.
కాల్షియం రిచ్ ఫుడ్స్‌లో నువ్వులు ముందుంటాయి.రెగ్యులర్‌గా గుప్పెన్ నువ్వులను బెల్లంతో కలిపి తీసుకుంటే శరీనికి కాల్షియం పుష్కలంగా అందుతుంది.
నువ్వులను తీసుకోవడంతో పాటు వంటలకు నువ్వుల నూనె వాడితే ఇంకా మంచిది.

అలాగే ప్రౌన్స్ లో కూడా అధిక శాతంలో కాల్షియం ఉంటుంది.అయితే ఫ్రాన్స్‌ను ఓవర్‌గా ఆయిల్ ఫ్రై చేయకుండా ఉడికించి తీసుకోవాలి.బెండ కాయలో కూడా కాల్షియం సమృద్ధిగా దొరుకుతుంది.
అందువల్ల, కాల్షియం లోపంతో బాధ పడే వారు తరచూ బెండకాయ వంటలను డైట్‌లో చేర్చుకుంటే మంచిది.

ఎండిన అంజీర పండ్లలోనూ కాల్షియం అత్యధికంగా ఉంటుంది.కాబట్టి, వీటిని ప్రతి రోజు తగిన మోతాదులో తీసుకుంటే మంచిది.ఇక వీటిలో పాటుగా పాలకూర, బ్రోకలీ, సోయాబీన్, రాజ్‌మా, రాగులు, పాలు, ములక్కాడలు, మెంతికూర, ఓట్స్, ఆరెంజ్, సీతాఫం, బాదం, ఎండు ద్రాక్ష, వేరుశెనగ కాయలు, పెరుగు వంటి వాటిలో కూడా కాల్షియం సూపర్‌గా ఉంటుంది.
అందువల్ల, వీటిని తీసుకుంటే కాల్షియం లోపానికి ఈజీగా చెక్ పెట్టవచ్చు.