బుమ్రా నా మజాకా.. సింగిల్ ఓవర్‌లో 29 రన్స్.. వరల్డ్ రికార్డు బద్దలు..!

28 ఏళ్ల కుర్ర ప్లేయర్ జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో మాత్రమే కాదు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతుంటాడు.ఆ విషయాన్ని మరోసారి నిరూపించి టీమిండియా ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాడు బుమ్రా.

 Bumracreate New World Record Bumra, New Record, Single Over, Sports Teams, Spor-TeluguStop.com

ప్రస్తుతం టీమ్ ఇండియా ఇంగ్లాండ్ టీమ్‌తో ఐదవ టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది.అయితే ఈ టెస్ట్‌లో స్టాండింగ్‌ కెప్టెన్‌ బుమ్రా వరల్డ్ రికార్డు బద్దలు కొట్టాడు.

టెస్టు ఫార్మాట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా బుమ్రా సరికొత్త వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్ చేసిన 84 ఓవర్‌లో బుమ్రా 29 రన్స్ చేసి ఆశ్చర్యపరిచాడు.అలా 18 ఏళ్లుగా బ్రియన్‌ లారా పేరుమీద చెక్కు చెదరకుండా ఉన్న రికార్డుని చేరిపేశాడు.2003లో జొహన్నెస్‌బర్గ్‌లో సౌతాఫ్రికా బౌలర్‌ ఆర్.పీటర్సన్ వేసిన ఒక ఓవర్ లో వెస్టిండీస్‌ ఆటగాడు బ్రియన్‌ లారా 28 పరుగులు సాధించాడు.ఆ రికార్డును తాజాగా బద్దలు కొట్టాడు బుమ్రా.

ఈ స్టార్ క్రికెటర్ స్టువర్ట్‌ బ్రాడ్ వేసిన 84 ఓవర్‌లో మొదటి బంతినే ఫోర్‌గా మలిచాడు. రెండో బంతిని వైడ్‌ కాగా అది ఫోర్ వెళ్లింది.

దాంతో 5 రన్స్ ఎక్స్‌ట్రాగా వచ్చాయి.నో బాల్‌ను సిక్సర్‌గా బాదాడు.

తర్వాతి మూడు బంతుల్లో నాలుగు ఫోర్లు బాదాడు.ఐదవ బంతిలో ఒక సిక్స్ కొట్టి ఓవర్‌ను సింగిల్‌తో ముగించాడు.

దాంతో 35 పరుగులు ఒకే ఓవర్ లో వచ్చాయి.అంటే ఈ ఓవర్‌లో బ్రాడ్‌ ఆరు ఎక్స్‌ట్రాలు ఇచ్చినట్లయింది.

ఇదిలా ఉండగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 రన్స్ కి ఆలౌటైంది.ఈ భారీ స్కోరులో రిషబ్‌ పంత్‌ 146 పరుగులు ఉండగా.జడేజా 104 పరుగులు ఉన్నాయి.మరోవైపు ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్‌ అండర్సన్‌ 5 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు.పొట్స్‌ 2 వికెట్లు తీయగా… బ్రాడ్‌, రూట్‌, స్టోక్స్‌ ఒక వికెట్ చొప్పున తీశారు.బుమ్రా ప్రపంచ రికార్డు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube