మంత్రి రోజా వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీస్ కేస్.. ఆ కులాన్ని కించపరిచేలా కామెంట్స్ చేశారంటూ?

వైసీపీ మంత్రి, ప్రముఖ నటి ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారనే సంగతి తెలిసిందే.కొన్నిసార్లు వివాదాల ద్వారా రోజా వార్తల్లో నిలుస్తుండగా మరికొన్ని సందర్భాల్లో ఆమె చేసిన కామెంట్లు ఆమెని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి.

 Budabukala Community Leaders Complaint Against Minister Rk Roja Details Here , M-TeluguStop.com

రోజా( Minister Roja ) తాజాగా చేసిన కామెంట్ల విషయంలో బుడబుక్కల సామాజికవర్గానికి చెందిన నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.నందిగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది.

తాజాగా రోజా ఒక సందర్భంలో పవన్( Pawan kalyan ) ను బుడబుక్కల వారితో పోలుస్తూ విమర్శలు చేయగా బుడబుక్కల సంఘం అధ్యక్షుడు సత్యం రోజా క్షమాపణలు చెప్పాలని కోరాడు.తమ కులాన్ని కించపరిచే విధంగా రోజా కామెంట్లు చేయడం సరికాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పవన్ పై రోజా విమర్శలు చేయడం కొత్తేం కాదు.గతంలో కూడా రోజా పవన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి.

Telugu Jana Sena, Roja, Pawan Kalyan, Ys Agan-Movie

రోజా పోలీసులకు ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.వరుస వివాదాల నేపథ్యంలో ఈ తరహా పొరపాట్లు రిపీట్ కాకుండా రోజా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రోజా వివాదాలకు దూరంగా ఉంటే మంచిదని ఆమె శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.

Telugu Jana Sena, Roja, Pawan Kalyan, Ys Agan-Movie

రోజాపై వైసీపీ ( YCP )నేతలలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో గెలవడానికి రోజా మరింత ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుందని చెప్పవచ్చు.రోజా పొలిటికల్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.కొంతమంది విమర్శలు చేస్తున్నా రోజాను అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఏపీ సీఎం వైఎస్ జగన్ సపోర్ట్ ఉండటం రోజాకు పొలిటికల్ కెరీర్ పరంగా ప్లస్ కానుంది.రోజా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube