కృష్ణా జలాలకు సంబంధించి నల్గొండలో బీఆర్ఎస్( BRS ) సభ నిర్వహించడం తెలిసిందే.కృష్ణానది జలాలలో తెలంగాణ హక్కుల పరిరక్షణ అంటూ నిర్వహించిన ఈ సభలో కేసిఆర్ కాంగ్రెస్( congress ) ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారిగా నిర్వహించిన ఈ సభకి భారీ ఎత్తున ప్రజలు రావడం జరిగింది.తన ప్రాణాన్ని లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్లు కేసిఆర్ ( KCR )సంచలన స్పీచ్ ఇచ్చారు.
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు హక్కులు కాపాడటం ప్రతిపక్ష నేతలుగా తమ కర్తవ్యం అని సంచలన స్పీచ్ ఇవ్వడం జరిగింది.రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ ప్రభుత్వం వచ్చాక రైతులకు 24 గంటలు కరెంటు ఇచ్చాం.
ఇప్పుడు ఆ కరెంటు యాడ పోయింది.
దద్దమ్మల రాజ్యమంటూ మండిపడ్డారు.ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే బజారులో నిలబెడతామని హెచ్చరించారు.ఏ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఇచ్చిందో ఆ విధంగా కరెంటును పునరుద్ధరించాలి.
ఇంకా అనేక విషయాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసిఆర్ హెచ్చరించారు.అయితే ఈ సభకు హాజరై తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత( BRS MLA Lasya Nanditha ) నార్కెట్పల్లి సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.
ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీ కొట్టింది.దీంతో కారు ముందు టైరు ఉడిపోయింది.
ఈ ఘటనలో ఎమ్మెల్యే తలకు స్వల్ప గాయమైంది.దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఆమె సోదరీ కూడా కారులోనే ఉన్నారు.నల్గొండ బీఆర్ఎస్ సభ నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.