తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పాగా.. మిషన్ చాణక్య సర్వే రిపోర్ట్

తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఓ సర్వే రిపోర్టును విడుదల చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ మిషన్ చాణక్య సంస్థ పబ్లిక్ పోల్స్ సర్వే చేసింది.

 Brs Victory Again In Telangana.. Mission Chanakya Survey Report-TeluguStop.com

ఇందులో భాగంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా అధికారం మళ్లీ బీఆర్ఎస్ దేనని సర్వేలో తేలిందని తెలుస్తోంది.దాదాపు నాలుగు నెలలుగా సర్వే చేసిన సంస్థ సుమారు 14 లక్షల మంది అభిప్రాయాలను సేకరించింది.ఇందులో బీఆర్ఎస్ కు 41.62 శాతం మంది అనుకూలంగా ఉన్నారని సమాచారం.అదేవిధంగా కాంగ్రెస్ కు 32.7 శాతం, బీజేపీకి 17.6 శాతం మంది ప్రజలు మద్ధతు చెబుతున్నారు.కాగా నా రాష్ట్రం నా ఓటు నా నిర్ణయం పేరుతో మిషన్ చాణక్య సంస్థ ఈ సర్వేను నిర్వహించింది.

ఈ క్రమంలోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధిపై 85 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం.అన్ని వయసుల ఓటర్లలోనూ ఎక్కువగా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని తెలిసింది.

ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ 76స్థానాలు గెలుస్తుందని సర్వే వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube