సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఒకటి రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి అంటే చాలు మూడో సినిమాకు ఆటోమేటిక్ గా పారితోషికాన్ని భారీగా పెంచేస్తూ ఉంటారు.
ఒకవైపు సినిమాలలో నటిస్తూ భారీగా సంపాదిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ ఉంటారు.అలా బాలీవుడ్ లో కూడా ఒక సారి హీరోయిన్ భారీగా సంపాదించింది.
సినిమాలతో పాటు పలు కమర్షియల్ యాడ్స్( Commercial Ads ) లో కూడా నటించింది.అలాగే పలు బిజినెస్ వ్యవహారాలు కూడా చూసుకుంటోంది.
ఆ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ ముద్దుగుమ్మ అలియా భట్( Alia Bhatt ).

ఈ ముద్దుగుమ్మ ఆదాయం హీరోలకు ఏ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు.చాలామందికి అలియా భట్ బిజినెస్ ఉమెన్ అన్న విషయం తెలియదు.ఆమెకు దాదాపు రూ.150 కోట్ల రూపాయల విలువైన యాడ్-ఎ-మామా( Ed-a-Mamma ) అనే ప్రసిద్ధ దుస్తుల బ్రాండ్‌ను కలిగి ఉంది.ఈ బిజినెస్ ద్వారా అలియా భట్ విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకుంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ అలియా భట్ ఇప్పటికే స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది.ఈమె గత ఏడాది బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌ను( Hero Ranbir Kapoor ) వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ దంపతులకు ఒక పాప కూడా జన్మించింది.కాగా అలియా భట్ ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోందని సమాచారం.

ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ.560 కోట్ల విలువ( Alia Bhatt Properties Value )తో ఇండియాలోనే అత్యధిక ఆస్తులు కలిగిన హీరోయిన్‌గా నిలిచింది.అలియా భట్ విలాసవంతమైన మూడు ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.
లండన్‌లో ఒకటి, ముంబైలోని జుహు, బాంద్రాలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.ప్రస్తుతానికి అలియా సోదరి షాహీన్ జుహూ ఇంట్లో ఉంటోంది.
అలియా మొదటిసారి ఇంటిని ఇండియాలో కాకుండా లండన్‌లోనే కొనుగోలు చేసిందట.గతంలో లండన్‌లో సొంతిల్లు ఉండాలనేది తన కల అని చెప్పుకొచ్చింది.ప్రస్తుతం అలియా భట్ లండన్ ఇంటి విలువ రూ.25 కోట్లు కాగా అది కోవెంట్ గార్డెన్‌లో ఉంది.2020లో అలియా భట్ బాంద్రాలో ఒక ఇంటిని కొనుగోలు చేసింది.వాస్తు పాలి హిల్స్ కాంప్లెక్స్ ఐదో అంతస్తులో ఉన్న ఈ ఇంటి ఖరీదు దాదాపు రూ.40 కోట్లు కాగా అదే బిల్డింగ్ కాంప్లెక్స్‌లోని ఏడో అంతస్తులో రణబీర్ కపూర్‌కు కూడా ఒక ఇల్లు కూడా ఉంది.బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కారు రూ.2.5 కోట్ల విలువైన రేంజ్ రోవర్‌తో పాటు అలియా భట్‌కు ఇంకా లగ్జరీ కార్లు ఉన్నాయి.ఆమె వద్ద ప్రస్తుతం 3 ఆడి కార్లు ఉన్నాయి.అన్నిటికి మించి ఆలియా భట్ రేంజ్ లో సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా పారితోషకం అందుకోవడం లేదు.