ఐపీఎల్ ఫైనల్లో నాటు నాటు స్టెప్పులతో రెచ్చిపోయిన బాలీవుడ్ హీరో.. వీడియో వైరల్!

గత రాత్రి ఐపిఎల్ ఎంతో అట్టహాసంగా ముగిసింది.ఎంతోమంది అభిమానులు, ప్రముఖుల మధ్య ఐపీఎల్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి.

 Bollywood Hero Dance Steps To Natu Natu Song In Ipl Final Video Viral Details,-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్, బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఐపీఎల్ ఫైనల్ లో పెద్ద ఎత్తున సందడి చేశారు.ఈ క్రమంలోనే రణవీర్ సింగ్ కేజిఎఫ్, మాస్టర్ సినిమాలోని పాటలకు కాలు కలుపుతూ అభిమానుల సందడి చేశారు.

ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన RRR చిత్రం నుంచి నాటు నాటు తెలుగు పాటను ప్లే చేశారు.

ఈ క్రమంలోనే ఈ పాటకు హీరో రణవీర్ సింగ్ అద్భుతమైన స్టెప్పులతో రెచ్చిపోయి డాన్స్ చేశారు.

ఈ విధంగా ఈ పాటకు రణవీర్ సింగ్ డాన్స్ చేయడంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా కేకలతో మార్మోగిపోయింది.ఇకపోతే ఐపీఎల్ ఫైనల్ లో తెలుగు పాటను ప్లే చేయడంతో తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం.

ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణం వల్ల ఐపీఎల్ ముగింపు వేడుకలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి దూరంగాఉంది.ఈ క్రమంలోనే ఈ ఏడాది ఐపిఎల్ ముగింపు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.ఇక ఈ కార్యక్రమానికి టీమిండియా మాజీ హెడ్ కోచ్, ప్రముఖ కామెంటేటర్ రవిశాస్త్రి హోస్ట్ గా వ్యవహరించారు.

ఇలా ఐపీఎల్ ముగింపు వేడుకల్లో భాగంగా బాలీవుడ్ హీరో రణవీర్ సందడి చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube