Bollywood Aamir Khan : ఆ సినిమా నన్ను పాతాళానికి తొక్కేసింది.. బాలీవుడ్ హీరో కామెంట్స్ వైరల్?

Bollywood Hero Aamir Khan Comments On Tahir Hussain Movie, Bollywood, Aamir Khan, Tahir Hussain Movie, Emotinal

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అమీర్ ఖాన్ ఇటీవల లాల్ సింగ్ చద్దా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

 Bollywood Hero Aamir Khan Comments On Tahir Hussain Movie, Bollywood, Aamir Khan-TeluguStop.com

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.ఈ సినిమాపై విడుదలకు ముందే బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీగా అంచనాలను నెలకొన్నాయి.

కానీ ఆ అంచనాలను చిత్తుచిత్తు చేస్తూ ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.అయితే లాల్ సింగ్ చద్దా సినిమా విడుదల తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు అమీర్ ఖాన్.

దాదాపుగా ఏడాదిన్నర పాటు సినిమాలు చేయకూడదని డిసైడ్ అయ్యారు అమీర్ ఖాన్.

ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీర్ ఖాన్ తన కుటుంబ పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు.అంతే కాకుండా ఇంటర్వ్యూలో భాగంగా తన బాధలను పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ.ఒకే ఒక్క సినిమా కారణంగా తన కుటుంబాన్ని పాతాళానికి తొక్కేసింది.

ఆ సినిమా వలన ఆర్థికంగా మా కుటుంబం చితికిపోయింది, అప్పుల వాళ్ళ గొడవతో మేమెంతో బాధపడే వాళ్ళం అంటూ తన చిన్నప్పుడు తన తండ్రి తీసిన ఒక సినిమా వలన తాము ఎన్ని కష్టాలు అని తెలిపారు.అమీర్ ఖాన్.

కాగా అమీర్ ఖాన్ తండ్రి అమీర్ ఖాన్ కి పదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక సినిమాను తీశారట.

Telugu Aamir Khan, Bollywood, Emotinal, Tahir Hussain-Movie

తన తండ్రి నిర్మాతగా తాహిర్ హుస్సేన్ లాకెట్ అనే సినిమా చేసారట.ఈ సినిమా కోసం అప్పట్లో స్టార్ నటులని కూడా తీసుకున్నారట.కానీ అమీర్ ఖాన్ తండ్రి అప్పట్లో పెద్ద నిర్మాత కాకపోవడంతో ఆ నటులు సరిగ్గా డేట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో తాహిర్ హుస్సేన్ లాకెట్ ని దాదాపుగా ఎనిమిదేళ్ళకి పూర్తి చేశారట.

ఈ సినిమా పూర్తయ్యేలోపులో ఆర్ధికంగా అమీర్ ఖాన్ ఫ్యామిలీ ఇబ్బంది పడడం కాదు, అప్పుల వాళ్ళ చేతిలో నానా మాటలు పడేవారట.అప్పుడు అమీర్ తండ్రి అప్పుల వాళ్లకి ఎంతగా నచ్చ జెప్పినా వారు వినకుండా రచ్చ చేసేవారట, నాన్న కష్టాలు చూసి ఏడ్చేవాడిని, అప్పటికి నా వయసు 10 ఏళ్ళు, ఏమి చెయ్యలేని పరిస్థితి.

ఒకే ఒక్క సినిమా మమ్మల్ని పాతాళానికి తొక్కేసింది అంటూ అమీర్ చిన్ననాటి కష్టాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube