Korameenu movie sunitha : అలాంటి సినిమాలే హిట్ అవుతాయ్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సింగర్ సునీత?

శ్రీపతి కర్రీ దర్శకత్వంలో ఆనంద్ రవి హీరోగా నటించిన తాజా చిత్రం కొరమీను.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలిసిందిలే అనే వీడియో సాంగ్ ని విడుదల చేశారు చిత్ర బృందం.ఈ కార్యక్రమాన్ని తాజాగా హైదరాబాదులో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి దర్శకుడు వశిష్ట అలాగే సింగర్ సునీత లు అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా దర్శకుడు శ్రీపతి కర్రీ మాట్లాడుతూ.ఈ కార్యక్రమానికి హాజరైన దర్శకుడు వశిష్ట గారికి,సింగర్ సునీత గారికి చాలా కృతజ్ఞతలు.

 Korameenu Movie Telisindi Ley Full Video Song Out Now Korameenu Movie,  Telisind-TeluguStop.com

ఈ సినిమాకు కథ ప్రధానం.హీరో ఆనంద్ రవి మంచి కథను ఇచ్చారు.

ఆయన దగ్గరే విషయాలు నేర్చుకున్నాను.మా గురువు గారిని డైరెక్ట్ చేశాను.

అతను చక్కగా డ్రైవ్ చేసేది టీం అని చెప్పుకొచ్చారు శ్రీపతి కర్రీ.ఆ తర్వాత సింగర్ సునీత మాట్లాడుతూ.ప్రస్తుత రోజుల్లో మంచి కంటెంట్ హీరో.చిన్న సినిమా పెద్ద సినిమా అనే గీతలు చెరిగిపోయాయి.

కంటెంట్ బాగుంటే కొత్త నటీనటులతో చేసిన మూవీ అయినా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరును సంపాదించుకుంటుంది.అటువంటి సినిమాల లిస్టులో కొరమీను కూడా తప్పకుండా చేరుతుంది అని తెలిపింది సింగర్ సునీత.

మన జీవన విధానానికి దగ్గరగా ఉండే సినిమాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి అని చెప్పుకొచ్చింది సింగర్ సునీత.ఇకపోతే కొరమీను సినిమా కథ విషయానికి వస్తే.

జాలరి పేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ మీసాల రాజు మీసాలు ఎవరు తీసేసారు అన్నది ఆసక్తికరంగా ఉండనుంది.

ఒక డ్రైవర్, అహంకారం బాగా డబ్బు ఉన్న అతని యజమాని, వైజాగ్ లో శక్తివంతమైన పోలీస్ ఇలా ఈ ముగ్గురి పాత్ర చుట్టూ కొరమీను సినిమా కథ తిరగనుంది.అనంతరం హీరో ఆనంద్ రవి మాట్లాడుతూ.ఈ సినిమాలో ఒక మనిషికి మీసాలు ఎవరు తీసి ఉంటారు అనే కాన్సెప్ట్ ఎక్కడ లేదు కానీ కథ పుట్టిందే అక్కడి నుండే.

పేదవాడికి గొప్ప వాడికి మధ్య జరిగే గొడవను కథలో తీసుకున్నాము.సినిమాలో చివరి ముప్పై నిముషాలు ఎంతో కీలకంగా ఉంటుంది.సినిమాను చూస్తే సర్ప్రైజ్ అవుతారు.ఈ సినిమా డిసెంబర్ 31న విడుదల కానుంది.

డిసెంబర్ 31న ఈ సినిమాను చూసి న్యూ ఇయర్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు హీరో ఆనంద్ రవి.ఇకపోతే తాజాగా విడుదల అయినా తెలిసిందిలే సాంగ్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.పలువురు ఈ వీడియో సాంగ్ చూసి తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని కామెంట్స్ తెలియజేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube