హైదరాబాద్ లో తెలంగాణ భవన్ ముట్టడికి బీజేవైఎం పిలుపునిచ్చింది.బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై దాడిని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
ఇందులో భాగంగా పెద్ద ఎత్తున చేరుకున్న బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు.ఈ నేపథ్యంలో నిరసన చెబుతున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో పార్టీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది.అనంతరం నిరసనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు.