మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజల్ ధరలు తగ్గించాలని కూకట్పల్లి ఫోరమ్ మాల్ నుండి ప్రధాన రహదారిపై కార్ కి తాడు కట్టి లాగుతు వినూత్న నిరసన.
ఈ సందర్బంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేసినా, కేసీఆర్ నియంత,నయా నిజాం నియంతృత్వ పోకడలతో పెట్రోల్,డీజిల్ ల పై వ్యాట్ తగ్గించలేదని,దేశం లోని వివిధ రాష్ట్రాల లో వ్యాట్ తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు.