యాదాద్రి భువనగిరి జిల్లా:టిఎస్పిఎస్సి ప్రశ్నపత్రాల లీకేజ్ అంశాన్ని శనివారం బీజేపీ నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు ఫిర్యాదు చేశారు.
భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్,హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్,మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచందర్,సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి,కరుణ గోపాల్ మరియు తదితరులతో కలిసి రాజ్ భవన్ కి వెళ్లి గవర్నర్ ని మర్యాదపూర్వకంగా కలసి సిట్టింగ్ జడ్జితో పారదర్శకంగా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.