టిఆర్ఎస్ పై బిజెపి నేత లక్ష్మణ్ విమర్శల జల్లు కురిపించారు.కెసిఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు అని అన్నారు.
బతికుండగా సమాధి కట్టి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్లు అని ప్రశ్నించారు, టిఆర్ఎస్ ఆగాధంలో కూరుకుపోతుందని చెప్పారు, కెసిఆర్ ఇచ్చిన ఏ హమీ ని అమలు చేయలేదు అని తెలిపారు.మునుగోడు ప్రజలకు సేవ చేసి ఉంటే ఇప్పుడు ఈ దిగజారుడు రాజకీయాలు అవసరం లేకపోయేవి అన్నారు.
ఉద్యమకారులంతా టిఆర్ఎస్ ను వదిలేసి బిజెపిలో చేరుతున్నారని తెలిపారు.కెసిఆర్ వెంట ఉధ్యమ ద్రోహులు మాత్రమే ఉన్నారని అన్నారు.