బిత్తిరి సత్తి( Bithiri Sathi ) పేరు చెబితే తెలియని వారు ఉండరేమో.అనేక న్యూస్ ఛానళ్ళలో అనేక వ్యంగ్య వార్తలు, అనేక కామెడీ షోలు చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.
తనదైన హావాభావాలతో వినోదాన్ని పంచుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా దగ్గరయ్యారు. టీవీ షోలతో బిజీగా ఉండగానే ఇప్పుడు రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని బిత్తిరి సత్తి ( చేవెళ్ల రవికుమార్ ) సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది .
దీనికి కారణం ఇటీవల ముదిరాజ్ ఆత్మగౌరవ సభలో బిత్తిరి సత్తి( Bithiri Sathi ) కీ రోల్ పోషించారు.ఆ సమయంలో అనేక రాజకీయ పార్టీలను ఉద్దేశించి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.అధికార పార్టీ బీఆర్ఎస్ ( BRS )ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు .ఇటీవల బీఆర్ఎస్ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క సీటు కేటాయించకపోవడంపై ,బిత్తిరి సత్తి అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా కలకాలం రేపాయి.ఆ వ్యాఖ్యలు తరువాత బిత్తిరి సత్తి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది.మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బిత్తిరి సత్తి ( Bithiri Sathi )సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది .ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి కారణం , ఇక్కడ ముదిరాజ్ ఓటర్లు ఎక్కువగా ఉండటమే.ఎక్కడ పోటీ చేస్తే గెలుపు కచ్చితంగా దక్కుతుంది అనే అంచనాతో ఉన్నారట. దీనికి తగ్గట్లుగా ఆ నియోజకవర్గానికి చెందిన కొంతమంది ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు జడ్చర్ల నుంచి పోటీ చేయాల్సిందిగా కోరుతున్నారట.
అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఇబ్బందులు అనే ఆలోచనతో ఉన్న ఆయన బిజెపి ( BJP )తనకు సీటు ఇస్తే జడ్చర్ల నుంచి పోటీ చేయాలనే ఆశా భావంతో ఉన్నారట . బిజెపి కీలక నేతలను కలిసి పార్టీలో చేరిక, సీటు విషయమై చర్చించబోతున్నట్లు బిత్తిరి సత్తి( Bithiri Sathi ) సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.