కమల్ హాసన్ నటించిన ఎర్ర గులాబీలు సినిమా మీకు గుర్తుందా.? ఈ సినిమా ఒక సీరియల్ కిల్లర్ కథాంశం తో దొరికింది సాధించింది.భారతీయ రాజా డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రానికి గాను ఆయనకు బెస్ట్ ఫిలింఫేర్ డైరెక్టర్ గా అవార్డు దక్కింది.ఇక ఈ సినిమాలో సీరియస్ నెస్ కంటిన్యూ చేయడం కోసం నల్ల పిల్లిని పెట్టి కొన్ని సీన్స్ షూట్ చేశారు దర్శకుడు.
కనిపిస్తున్న ప్రతిసారి చూస్తున్న ప్రేక్షకుడికి ఒక రకమైన భయం మొదలవుతుంది.పియానో పై అది అడుగులు వేస్తూ వెళుతుంటే వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా భయంకరంగా అనిపించే ప్రేక్షకుడిని అలాగే కట్టిపడేస్తుంది.
అయితే స్క్రిప్ట్ ప్రకారం ఈ సినిమాలో నల్ల పిల్లి ఉండాలని దర్శకుడు భారతి రాజా అనుకున్నప్పుడు అసలు అలాంటి పిల్లి దొరకడం గగనం అయిపోయింది.చెన్నై మహానగరంలో నల్ల పిల్లి కోసం మేనేజర్ చాలా గాలించాడు అంతేకాదు.ఒక డబ్బున్న కుటుంబం పెంచుతుందని తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు.ఇక అక్కడే చూసి కొన్ని పిల్లల్లో ఒక జాతి పిల్లి నచ్చడంతో మేనేజర్ తీసుకొచ్చాడు.సదరు పిల్లి మంచి చాలా మేలు జాతి నల్ల పిల్లి.సినిమాలో అది కనిపించిన ప్రతిసారి అది ఒక కాస్ట్లీ పిల్లి అని అర్థం అయిపోతుంది.
ఆ పిల్లి తో భయపెట్టల్సిన అన్ని సీన్స్ నీ తీశారు మొదట దర్శకుడు.ఇక ఒక సీన్ లో అయితే సదరు పిల్లి శ్రీదేవి పై అటాక్ చేసే సీన్ కూడా తీశారు.మూడు రోజుల తర్వాత పిల్లి గోడ దూకి షూటింగ్ నుంచి పారిపోయింది.ఆ విషయం తెలిసి ఆ పిల్లి ఓనర్ చిత్ర బృందం పై కేసు పెట్టారు.
ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో కొంత డబ్బు సెటిల్ చేసి ఆ కేసు నుంచి బయట పడ్డారు.కానీ భారతి రాజాకు మాత్రం ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ పిల్లి ఎక్కడికి వెళ్లిపోయిందని ఒకటే బెంగగా ఉంటుందట.
ఇక ఆ పిల్లిని ఏదో ఒక యనిమల్ లాగా కాకుండా, ఒక సెలబ్రిటీ గా చూసుకున్నామని ఇప్పటికీ కూడా భారతి రాజా తలుచుకుంటూ ఉంటారు.