ఇండస్ట్రీలోకి వచ్చిన ఆరు సంవత్సరాల కాలంలోనే దాదాపు 17 సినిమాలలో నటించి నేషనల్ క్రష్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి రష్మిక మందన్న ఒకరు.ఇలా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో వరుస అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక ఇండస్ట్రీ అన్న తర్వాత ఈ గ్లామర్ ప్రపంచంలో ఒక నటిని ఎంత మంది అభిమానిస్తారో అంత మంది విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు.ఈ క్రమంలోనే పలుమార్లు రష్మికపై చాలామంది ట్రోల్స్ చేస్తూ తనని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు.
ఇలా రష్మిక పలుమార్లు నెటిజన్ ల ట్రోలింగ్స్ కు గురవుతూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.ఈ క్రమంలోనే ఈమె పలుమార్లు ట్రోలర్స్ కు తనదైన శైలిలో సమాధానం చెప్పింది.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు.

ఎలాంటి సమస్యలు వచ్చిన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు అదెలా సాధ్యం అనే ప్రశ్న ఈమెకు ఎదురయింది.అయితే ఈ ప్రశ్నకు రష్మిక సమాధానం చెబుతూ తాను చిన్నప్పుడే చిరునవ్వుతో జీవించడం నేర్చుకున్నానని ఈమె తెలిపారు.

చిన్నప్పుడు తన విద్యాభ్యాసం మొత్తం హాస్టల్లోనే కొనసాగిందని తెలియజేశారు.అక్కడ దాదాపు 800 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్లు అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లం వల్ల తనతో ఎవరు సరిగా మాట్లాడేవారు కాదు.అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఎన్నో అపార్థాలు కూడా తలెత్తవి.
నేను చేయని తప్పులకు ఎన్నో మాటలు పడేదాన్ని.ఇలా తాను చేసిన తప్పులకు మాటలు పడుతున్న సమయంలో ఎన్నోసార్లు గదిలో కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చానని ఈ సందర్భంగా రష్మిక తెలిపారు.
అయితే నాకు ఎలాంటి సమస్య వచ్చినా నేను అమ్మతో ఆ సమస్యను పంచుకోవడం నాకు అలవాటు అదే నన్ను ఇంత స్ట్రాంగ్ గా నిలబెట్టింది అంటూ రష్మిక చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







