కరోనా పోరాటంలో తన వంతు కృషి చేస్తున్న బీసీసీఐ..!

ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని ఎంత అత‌లాకుత‌లం చేస్తుందో చూస్తూనే ఉన్నాం.బెడ్లు లేక‌, ఆక్సిజ‌న్ లేక‌, మెడిసిన్లు టైమ్‌కు అంద‌క రోజూ వేలాది మంది చనిపోతూనే ఉన్నారు.

 Bcci Is Doing Its Part In The Corona Fight Bcci, Carona Virus, Bcci , Oxygen Co-TeluguStop.com

ఈ వైర‌స్‌పై పోరాడేందుకు అనేక‌మంది ముందుకొస్తున్నారు.చాలా సంస్థ‌లు భారీ విరాళాన్ని ప్ర‌క‌టిస్తున్నాయి.

ఇప్పుడు క‌రోనాపై పోరుకు బీసీసీఐ కూడా ముందుకొచ్చింది.

క‌రోనా పేషెంట్ల‌కు మెరుగైన వైద్య స‌దుపాయాలు అందించేందుకు ఆస్ప‌త్రుల‌కు భారీగా విరాళం అందిస్తోంది.

ఇప్ప‌టికే అనేక ర‌కాలుగా సాయం చేస్తోంది బీసీసీఐ.ఇందులో వైద్య సంస్థలకు 10 లీటర్ల సామ‌ర్థ్యం గ‌ల 2 వేల ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను పంపిణీ చేయనున్నట్లు బీసీసీఐ వివ‌రించింది.

కరోనా మ‌హ్మారి కారణంగా వేలాది మంది ప్ర‌జ‌లు త‌మ ప్రాణాలు విడిచారు.అయితే ఈ కొవిడ్ పై పోరులో భాగంగాభారత్ ప్రయత్నాలను బలోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని బీసీసీఐ ప్రకటించింది.

ఇప్పుడున్న ఈ తీవ్ర‌త కార‌ణంగా దేశమంతా తీవ్రంగా దెబ్బతింది.ప్రత్యేకించి మెడికల్ సదుపాయాలు, వైద్య పరికరాలు, ఆక్సిజన్ డిమాండ్లు విప‌రీతంగా పెరిగాయి.ఇక ముందు ముందు నెలల్లో కరోనా రోగులకు అత్యవసర వైద్య సహాయం, స‌దుపాయాలు అందించాలని బీసీసీఐ అంద‌రినీ కోరుతోంది.మిగ‌తా సంస్థులు, వ్య‌క్తులు కూడా ముందుకు వ‌స్తే అంద‌రం క‌లిసి క‌రోనాను నియంత్రిచ్చ‌వ‌చ్చని బీసీసీఐ అభిప్రాయ‌ప‌డింది.

Telugu Bcci, Carona, Covid-Latest News - Telugu

త‌న వంతుగా భారతదేశం అంతటా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అంద‌జేస్తామ‌ని భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు తెలియ‌జేసింది.గత ఏడాదిలో మహమ్మారి మొదటి వేవ్‌లో భారత క్రికెట్ బోర్డు PM కేర్స్ ఫండ్‌కు రూ.51 కోట్లు విరాళం ఇచ్చింది.వైరస్‌పై సాగుతున్న సుదీర్ఘ యుద్ధంలో పోరాడుతున్న వైద్య, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల విశేష కృషిని బోర్డు అభినందించింది.మ‌రిన్ని సేవ‌లు అందించేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని బోర్డు ప్ర‌తినిధులు స్ప‌ష్టం చేశారు.

ఎంతైనా బీసీసీఐ చేస్తున్న సేవ‌లు మంచిగున్నాయి క‌దా.ఇప్పుడు బీసీసీఐని అంద‌రూ పొగ‌డుతున్నారు.

గ్రేట్ అంటూ మెచ్చుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube