BB4: ఈ వారం అతడేనా ఎలిమినేషన్..?!

ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ సీజన్ 4 నడుస్తోంది.చివరి దశకు చేరుకున్న బిగ్ బాస్ సీజన్ 4 ప్రస్తుతం బాగా రసవత్తరంగా సాగుతోంది.

 Bb4: ఈ వారం అతడేనా ఎలిమినేషన్..?!-TeluguStop.com

బిగ్ బాస్ ఇంట్లోని సభ్యులకు బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు, అలాగే వారి మధ్య గొడవలు క్రియేట్ చేయడం అలాగే కొందరి వద్ద ప్రేమను చిగురింప చేయడం ఈ షోలో మరిన్ని విషయాల పై ఆసక్తిని పెంచుతూ ముందుకు తీసుకు వెళుతున్నారు.గత వారం లో జరిగిన నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న విషయంపై ప్రేక్షకులు ఎప్పుడు లేని విధంగా బాగా ఎదురుచూస్తున్నారు.

ఎప్పటికప్పుడు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఓటింగ్ ను బట్టే ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుందని చెబుతూ వస్తున్నాడు.

ఇక అసలు విషయంలోకి వెళితే.

నేడు బిగ్ బాస్ ఇంట్లో నుంచి మెహబూబ్ దిల్ సే ను ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది.బిగ్ బాస్ ఇంట్లో 10 వారాలు కొనసాగిన మహబూబ్ తాజాగా ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

బిగ్ బాస్ హౌస్ కి రాకముందు అతను యూట్యూబ్ లో తన యాక్టింగ్, డాన్స్ వీడియోలతో బాగా ఫేమస్ అయ్యాడు.ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో బాగా యాక్టివ్ గా ఉండే వ్యక్తులలో మెహబూబ్ కూడా ఒకడు.

బిగ్ బాస్ హౌస్ లో జరిగే టాస్క్ లో భాగంగా ప్రతిసారి పూర్తి న్యాయం చేకూర్చే వ్యక్తిగా మెహబూబ్ పేరు తెచ్చుకున్నాడు.అయితే ఎలిమినేషన్ నుండి తప్పించుకోవడానికి యాక్టివ్ గా ఉండాలి అంటూ షో హోస్ట్ మెహబూబ్ కు సలహా కూడా ఇచ్చారు.

అయితే ఇందుకోసం మెహబూబ్ కూడా బాగా ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు.కాకపోతే, ఇది వరకు వారంలో మెహబూబ్ చేసిన కొన్ని పొరపాట్ల వల్ల చివరికి అతను ఎలిమినేషన్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చూడాలి మరి ఈ రోజు మెహబూబ్ బయటికి వెళ్తాడో లేకపోతే మరో కంటెస్టెంట్ బయటికి వస్తారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube