ఆ చెట్టు ఆకులు, కొమ్మ‌లు, పండ్లు అన్నీ ఉప‌యోగ‌క‌ర‌మే.. ఎంత విలువైన‌వంటే..

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా పేరొందింది.అయితే అక్క‌డ ఉండే స‌ర్గి చెట్ల ఆకులు, కొమ్మ‌లు పండ్లు మొద‌లైన‌న్నీ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంటాయి.

 Bastar Sargi Tree Fruits Branch Leaves Everything Is Commercial , Bastar Sargi T-TeluguStop.com

ఈ చెట్టుకు స్థానికంగా ఎంతో గుర్తింపు ఉంది.విస్త‌రాకుల‌ను సర్గి ఆకులతో తయారు చేస్తారు.

వీటిని ఉపయోగించిన తర్వాత విసిరివేసినప్పుడు అవి వాటిక‌వే నాశనం అవుతాయి.పర్యావరణానికి ఎంత‌మాత్రం హాని కలిగించవు.

బస్తర్‌లో దీనిని అనేక సాంప్రదాయ పండుగలు, వివాహాలు, అంత్యక్రియలు మొదలైన వాటిలో ఉపయోగిస్తారు.విస్త‌రాకులు త‌యారుచేసే ప‌నిని ఏదో ఒక‌ సంఘం చేయ‌దు.

గ్రామస్తులు తమ అవసరాల‌ను అనుస‌రించి తామే విస్త‌రాకుల‌ను సిద్ధం చేసుకుంటారు.విస్త‌రాకుల‌ను తయారు చేయడం ఎంతో సులభం.

విస్త‌రాకు తయారీకి దాదాపు ఏడు ఆకులు కావాలి.అవసరాన్ని బట్టి విస్త‌రాకును చిన్నదిగా లేదా పెద్దదిగా చేసుకోవచ్చు.

ఈ ఆకుల‌తో స్థానికులు దొన్నెల‌ను త‌యారు చేసుకుని వాటిని పాత్ర‌లుగా వినియోగిస్తారు.వీటిని మార్కెట్‌లో కూడా విక్ర‌యిస్తుంటారు.

బస్తర్ గ్రామస్థులు సర్గి పండును సేకరించి.వాటితో నూనె, సబ్బుల‌ను తయారు చేస్తారు.

సర్గి సబ్బును బట్టలు ఉతకడానికి, స్నానానికి ఉపయోగిస్తారు.ఈ సబ్బులో నూనె ఉంటుంది కాబట్టి దీనితో స్నానం చేయడం వల్ల శరీరం పొడిబారదు.బట్టల రంగు చెడిపోదు.దీపం వెలిగించడానికి, ఆహారం వండడానికి, చేతులకు, కాళ్ళకు పూయడానికి కూడా సర్గి నూనెను ఉపయోగిస్తారు.

ఇది ఒక విధంగా మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.సర్గి పండును నీటిలో ఉడకబెట్టిన‌ త‌రువాత‌ ఎండలో ఎండబెట్టి తింటారు.

ఈ చెట్టు కొమ్మ‌ల‌ను కడుపు నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నానికి వినియోగిస్తారు.దంతాలను శుభ్రం చేయడానికి మ‌నం బ్రష్ వాడుతుంటాం.

కానీ గ్రామీణ జీవితంలో నేటికీ వేప‌పుల్ల‌లు వాడుతుంటారు.బస్తర్‌లోని ప్రజలు తమ దంతాలను శుభ్రం చేసుకోవ‌డానికి సర్గి కొమ్మను ఉపయోగిస్తారు.

సర్గి కొమ్మ‌ల రుచి కూడా బాగుంటుంద‌ని చెబుతారు.ఇది మౌత్ ఫ్రెషనర్ మాదిరిగా పనిచేస్తుంది.

అడవి లేకుండా బస్తర్‌లో జీవితం అసంపూర్ణమని, బస్తర్ ప్రజల జీవితాల్లో అడవి ప్రాముఖ్యత ఎంతో ఉంద‌ని స్థానికులు చెబుతుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube