నచ్చితే అందలం ఎక్కించడం నచ్చకపోతే పాతాళానికి తొక్కివేయటం కెసిఆర్ స్పెషాలిటీ అంటారు కెసీఆర్( CM KCR ) రాజకీయ ప్రత్యర్ధులు .తనకు భవిష్యత్తులో పోటీ వస్తారనే అనుమానం ఉన్న వారిని ఎవరినైనా సరే ఆయన నిర్ధాక్షిణ్యంగా పక్కకు పెడుతుంటారు అని కేసీఆర్ని దగ్గరగా చూసినవారు చెబుతారు .
ముఖ్యంగా కోదండరాం, ప్రొఫెసర్ జయశంకర్, ఈటల రాజేందర్ వంటి వారిని అవసరంలో పూర్తిస్థాయి లో వాడుకుని గౌరవం ఇచ్చిన కేసీఆర్ అవసరం తీరిన తర్వాత వారిని పొమ్మనలేక పోగబెట్టిన రీతిలో పక్కకు పెట్టారని అంతేకాకుండా పొంగులేటి సుధాకర్ రెడ్డి( Ponguleti Sudhakar Reddy ) వంటి వారి విషయంలో కూడా వారిని పార్టీలోకి చేర్చుకోవడానికి అత్యుత్సాహం చూపి తర్వాత రాజకీయ అవకాశాల్లో మాత్రం మొండి చెయ్య చూపించారని చెబుతారు.
ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య విషయంలో బారాస చూపిస్తున్న మర్యాద కేవలం ఎన్నికల కేంద్రంగానే జరుగుతుందని బీసీలకు కాంగ్రెస్లో అన్యాయం జరుగుతుందన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరగడానికి ఒక అస్త్రంగా పొన్నాల లక్ష్మయ్య ను ప్రయోగించబోతున్నారని విశ్లేషణలు వస్తున్నాయి.
కాంగ్రెస్లో కీలక హోదాలలో పనిచేసిన పొన్నాల లక్ష్మయ్యకు( Ponnala Lakshmaiah ) పట్ల కాంగ్రెస్ తగిన మర్యాద గౌరవం ఇవ్వలేదని తద్వారా బీసీలకు ఆ పార్టీలో తగిన గుర్తింపు లేదన్న వాతావరణం క్రియేట్ చేయడానికే పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్లి మరి కేటీఆర్ పార్టీ లోకి ఆహ్వానించినట్లుగా ప్రచారం జరుగుతుంది.తద్వారా సమయం చూసి కాంగ్రెస్కు వాత పెట్టడానికే ఒక టూల్ గా పొన్నాల ఉపయోగపడుతున్నారని ఉన్నట్టుండి హఠాత్తుగా పొన్నాలపై ఇంత ప్రేమ పుట్టడం వెనుక కారణం ఇదేనని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ రాజకీయ అవకాశాలను రెండు చేతులా ఓడిసి పట్టుకోవడంలో తాను చాణిక్యడినని నిరూపించుకున్న కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ చేసిన తప్పిదాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.మరి దాని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.