మరోసారి జగన్ బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ( Balineni Srinivasareddy ) వ్యవహారం తెరపైకి వచ్చింది.మొదటి విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కించుకున్న బాలినేని రెండో విడతలో తనను కొనసాగించకపోవడంపై కాస్త అలక చెందారు .
ఆ తరువాత నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు , ప్రోటోకాల్ సమస్యలు తదితర కారణాలతో చాలాకాలంగా అసంతృప్తి తో ఉంటూ వచ్చారు.అయితే జగన్ స్వయంగా కలుగజేసుకుని బాలినేని ని బుజ్జగించడంతో ఆ వ్యవహారం అక్కడితో సద్దుమణిగింది .ప్రస్తుతం పార్టీ వ్యవహారాల్లో ఆయన బిజీగా ఉంటున్నారు. తాజాగా ఆయన తీసుకున్న ఓ నిర్ణయం మరోసారి సంచలనంగా మారింది.
ఫేక్ డాక్యుమెంట్స్ స్కాంలో( Fake Documents Scam ) పోలీసులు వ్యవహార శైలి ఆగ్రహంతో ఉన్న బాలినేని పోలీసుల తీరును నిరసిస్తూ తన గన్ మెన్లను( Gunmen ) ప్రభుత్వానికి సరెండర్ చేశారు.ఈ మేరకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి( DGP Rajendranath Reddy ) లేఖ కూడా రాశారు.ఫేక్ డాక్యుమెంట్స్ స్కామ్ లో వైసీపీ నేతలు ఉన్నా వదిలి పెట్టవద్దని ఇప్పటికే అనేకసార్లు అధికారులను కోరిన బాలినేని అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని , తన రాజకీయ జీవితంలో ఇటువంటి తీరును ఎప్పుడు చూడలేదని బాలినేని ఫైర్ అవుతున్నారు.
ఇప్పటికే ఈ కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టవద్దని , మూడు రోజుల క్రితం కలెక్టర్ సమక్షంలో ఎస్పీని బాలినేని కోరారు .పోలీసులు తన సూచనలు పట్టించుకోకపోవడంతో విసుగు చెందినట్లు డీజీపీ కి రాసిన లేఖలో పేర్కొన్నారు.తాను చెప్పిన సూచనలను పోలీసులు పట్టించుకోవడంలేదని, అందుకే నిరసన వ్యక్తం చేస్తూ గన్ మెన్ల ను సరెండర్ చేస్తున్నట్లు బాలినేని చెబుతున్నారు.ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
బాలనేని వ్యవహారంలో వైసిపి పెద్దలు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.