ఆ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ ఆందోళన.. అంత కలవరపాటు దేనికంటే?

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని భారీ వసూళ్లు కూడా రాబట్టింది.

 Balayya Fans Tension On Balakrishna Anil Ravipudi Combo Details, Anil Ravipudi ,-TeluguStop.com

చాలా రోజుల తర్వాత బాలయ్యకు మంచి విజయం దక్కడంతో ఆనందంగా ఉన్నారు.ఇలాంటి ఘన విజయం తర్వాత యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 107 వ సినిమాను చేస్తున్నాడు.

ప్రెసెంట్ ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న విషయం విదితమే.ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే బాలయ్య నెక్స్ట్ అనిల్ రావిపూడి తో సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

ప్రెసెంట్ అనిల్ రావిపూడి చేసిన ‘ఎఫ్ 3′ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక అనిల్ తన ఫోకస్ అంతా బాలయ్య సినిమాపై పెట్టనున్నాడు.

Telugu Anil Ravipudi, Balakrishna, Balayyaanil, Mithrudu, Nandamuri Fans, Priyam

సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ సినిమా స్టార్ట్ కానుంది.ఇప్పటికే ఈ సినిమా స్టోరీ లైన్ ను అనిల్ లీక్ చేసాడు.ఇది తండ్రీకూతుర్ల మధ్య సాగే ఎమోషనల్ స్టోరీ అని బాలయ్య ఇందులో 50 ఏళ్ల వృద్దుడి పాత్రలో నటించనున్నాడని ఆయన కూతురుగా శ్రీలీల అనిల్ చెప్పుకొచ్చాడు.ఇక బాలయ్యకు జోడీగా ప్రియమణి ఎంపిక అయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయి.

Telugu Anil Ravipudi, Balakrishna, Balayyaanil, Mithrudu, Nandamuri Fans, Priyam

ఈ నేపథ్యంలోనే నందమూరి ఫ్యాన్స్ కలవర పడుతున్నారు.ఎందుకంటే.గతంలో బాలకృష్ణ, ప్రియమణి జంటగా నటించిన మిత్రుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలం అయ్యింది.ఈ సినిమా మాములు ప్రేక్షకులే కాదు బాలయ్య ఫ్యాన్స్ ను కూడా ఆకట్టుకోలేదు.

మళ్ళీ ఇప్పుడు సక్సెస్ రేట్ తక్కువుగా ఉన్న ప్రియమణి పేరు బాలయ్యతో చేర్చడం ఫ్యాన్స్ కు మింగుడు పడడం లేదు.ఈమె పేరు విన్నదగ్గర నుండి ఎక్కడో తేడా కొడుతోంది అంటున్నారు ఫ్యాన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube