Balakrishna veera simha reddy : ఆ విషయంలో వీరయ్య కంటే ముందు ఉన్న వీర సింహారెడ్డి

ఈ సంక్రాంతి కి టాలీవుడ్ బాక్సాఫీస్ ముందుకి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.బాబీ దర్శకత్వం లో రూపొందుతున్న ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాలేదు.

 Balakrishna Veera Simha Reddy Upper Hand On Chiranjeevi Waltair Veerayya Movie ,-TeluguStop.com

ఒకటి లేదా రెండు వారాల్లో షూటింగ్ పూర్తి అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.ఇక సంక్రాంతి బరి లో మరో హీరో నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమం లు దాదాపుగా పూర్తయ్యాయి.ఒకటి రెండు రోజుల షూటింగ్ తో వీర సింహారెడ్డి కి గుమ్మడి కాయ కొట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.

అంతే కాకుండా వీర సింహారెడ్డి సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి.సినిమా ను ఇన్ని రోజులు సంక్రాంతి కానుకగా విడుదల చేస్తాం అంటూ మైత్రి మూవీ మేకర్స్ వారు చెప్పి వచ్చారు.

కానీ విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు.

తాజాగా జనవరి 12వ తారీఖున ఈ సినిమా ను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

కానీ ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా యొక్క విడుదల తేదీ విషయం లో అధికారికంగా క్లారిటీ రాలేదు.దాంతో రిలీజ్ డేట్ విషయం లో మరియు ప్రమోషన్ కార్యక్రమాల విషయం లో వీరయ్య కంటే వీరసింహారెడ్డి ముందు ఉన్నాడు అంటూ సోషల్ మీడియా లో నందమూరి బాలకృష్ణ అభిమానులు చర్చించుకుంటున్నారు.

Telugu Balakrishna, Chiranjeevi, Tollywood, Varasudu, Vijay-Movie

ఈ రెండు సినిమా లను కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తూ ఉండగా ఈ రెండు సినిమాల్లో కూడా హీరోయిన్ గా శృతి హాసన్ నటించి అందరి దృష్టి ని ఆకర్షిస్తుంది.ప్రస్తుతం రెండు సినిమాల యొక్క సంక్రాంతి వసూళ్ల విషయమై ఆసక్తికర చర్చ జరుగుతుంది.ఈ రెండు సినిమా లతో పాటు తమిళ సూపర్‌ స్టార్ విజయ్ నటిస్తున్న వారసుడు సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube