ఆ విషయంలో వీరయ్య కంటే ముందు ఉన్న వీర సింహారెడ్డి
TeluguStop.com
ఈ సంక్రాంతి కి టాలీవుడ్ బాక్సాఫీస్ ముందుకి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.
బాబీ దర్శకత్వం లో రూపొందుతున్న ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాలేదు.
ఒకటి లేదా రెండు వారాల్లో షూటింగ్ పూర్తి అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.ఇక సంక్రాంతి బరి లో మరో హీరో నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమం లు దాదాపుగా పూర్తయ్యాయి.ఒకటి రెండు రోజుల షూటింగ్ తో వీర సింహారెడ్డి కి గుమ్మడి కాయ కొట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.
అంతే కాకుండా వీర సింహారెడ్డి సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి.
సినిమా ను ఇన్ని రోజులు సంక్రాంతి కానుకగా విడుదల చేస్తాం అంటూ మైత్రి మూవీ మేకర్స్ వారు చెప్పి వచ్చారు.
కానీ విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు.తాజాగా జనవరి 12వ తారీఖున ఈ సినిమా ను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
కానీ ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా యొక్క విడుదల తేదీ విషయం లో అధికారికంగా క్లారిటీ రాలేదు.
దాంతో రిలీజ్ డేట్ విషయం లో మరియు ప్రమోషన్ కార్యక్రమాల విషయం లో వీరయ్య కంటే వీరసింహారెడ్డి ముందు ఉన్నాడు అంటూ సోషల్ మీడియా లో నందమూరి బాలకృష్ణ అభిమానులు చర్చించుకుంటున్నారు.
"""/"/
ఈ రెండు సినిమా లను కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తూ ఉండగా ఈ రెండు సినిమాల్లో కూడా హీరోయిన్ గా శృతి హాసన్ నటించి అందరి దృష్టి ని ఆకర్షిస్తుంది.
ప్రస్తుతం రెండు సినిమాల యొక్క సంక్రాంతి వసూళ్ల విషయమై ఆసక్తికర చర్చ జరుగుతుంది.
ఈ రెండు సినిమా లతో పాటు తమిళ సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న వారసుడు సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్న ఐటీ.. తెర వెనుక ఇంత జరిగిందా?