తెలంగాణలో అమలయ్యే సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని సీఎం కేసీఆర్ అన్నారు.మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
గతంలో సమస్యలతో బాధపడ్డ పాలమూరు జిల్లా నేడు సంతోషంగా ఉందన్నారు.పోరాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి బాటలో ఉందని తెలిపారు.
ఏ తెలంగాణ కోరుకున్నామో ఆ బాటలోనే ఉన్నామని పేర్కొన్నారు.ఇంకా అద్భుతమైన ప్రగతి సాధించాలన్నారు.
సంక్షేమ పథకాల్లో మనకెవరూ సాటిరారని వెల్లడించారు.మనం ఉన్నప్పుడు ఏం చేశామో అదే శాశ్వతమన్న కేసీఆర్ జీవితానికి అదే పెద్ద సంతృప్తి అని తెలిపారు.
త్వరలో రెండో విడత కంటి వెలుగు పథకానికి శ్రీకారం చుట్టబోతున్నామని కేసీఆర్ తెలిపారు.గురుకులాలను మూడు, నాలుగు రెట్లు పెంచుతామన్నారు.
ఏ పనైనా ఓ దృక్పథం, ఆలోచన, సుదీర్ఘ చర్చ తర్వాతే చేపడతామని పేర్కొన్నారు.ఎనిమిదేళ్ల కింద తెలంగాణ చాలా కష్టాలు అనుభవించిందని వెల్లడించారు.