Adivi Sesh HIT 2 : యూఎస్ లో దూసుకెళ్తున్న 'హిట్ 2'.. 1 మిలియన్ దిశగా అడుగులు!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటించిన లేటెస్ట్ సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హిట్ 2’.హిట్ 1 సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

 Hit 2 Sensation In Usa With 1 Million Mark , Adivi Sesh, hit 2, Nani,vishwak Se-TeluguStop.com

ఈ సినిమా విశ్వక్ సేన్ హీరోగా 2020 లో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ అనిపించు కుంది.ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేసారు దర్శక నిర్మాతలు.

ఈ సినిమాను న్యాచురల్ స్టార్ నాని స్వయంగా నిర్మించారు.వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మించిన సినిమాల్లో హిట్ 1 ఒకటి.ఇక ఈ సినిమా సక్సెస్ ఫుల్ అవ్వడంతో మళ్ళీ నాని సీక్వెల్ కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు.అయితే ఈసారి హీరోగా విశ్వక్ సేన్ కాకుండా అడవి శేష్ ను తీసుకున్నారు.

ఇదే ఈ సినిమాకు ఇప్పుడు ప్లస్ అయ్యింది అనే చెప్పాలి.

ఎందుకంటే అడవిశేష్ ఇటీవలే మేజర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు.

దీంతో హిట్ 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.అలాగే ప్రొమోషన్స్ కూడా బాగా చేయడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.మొన్న శుక్రవారం డిసెంబర్ 2న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ సినిమా యూఎస్ లో కూడా భారీ బజ్ తో రిలీజ్ అయ్యింది.

Telugu Adivi Sesh, Usa, Usa Mark, Nani, Vishwak Sen-Movie

ఇక ప్రీమియర్స్ మరియు ఫస్ట్ డే తోనే ఈ సినిమా అక్కడ హాఫ్ మిలియన్ ను క్రాస్ చేసింది.దీంతో మూడు రోజుల్లోనే 1 మిలియన్ మార్క్ దిశగా హిట్ 2 దూసుకు వెళ్తుంది. రెండవ రోజు 6 లక్షల 50 వేల డాలర్స్ కు చేరుకున్న ఈ సినిమా మరో రెండు రోజుల్లో 1 మిలియన్ డాలర్స్ మార్క్ చేరుకునే దిశగా అడుగులు వేస్తుంది.ఇదే జరిగితే ఏ సర్టిఫికెట్ తోనే 1 మిలియన్ అందుకున్న రెండవ టాలీవుడ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube