ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలు ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే.జనం తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని జీవిస్తున్నారు.
అయితే గత రెండు నెలలుగా లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగాలకు చెందిన పనులు వాయిదా పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కాగా సినీ రంగానికి చెందిన కార్మికులను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు తమవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన సినిమా షూటింగ్‌లకు అనుమతిని కోరుతూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పలువురు చర్చలు జరిపారు.దీంతో తెలుగు సినిమా షూటింగ్‌లకు అనుమతి లభించింది.
అయితే ఆ సమయంలో నందమూరి బాలకృష్ణ పలు సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.కాగా ఇప్పట్లో సినిమా షూటింగ్‌లు ప్రారంభించడం మంచిది కాదని ఆయన అన్న సంగతి తెలిసిందే.
కాగా ప్రస్తుతం కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో సినిమా షూటింగ్‌లను మళ్లీ వాయిదా చేశారు.
అయితే కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉందని బాలయ్య అప్పుడే చెప్పాడు.
ఇప్పుడు అది నిజం కావడంతో ఈ ప్రమాదకర పరిస్థితిని బాలయ్య ముందుగానే అంచనా వేయడంలో సక్సెస్ అయ్యాడని పులువురు ఆయన్న మెచ్చుకుంటున్నారు.ఈ విషయంలో చిరు అంచనాలు పూర్తిగా తారుమారు అయ్యాయని పలువురు అంటున్నారు.
ఏదేమైనా ఆరోగ్యమే ప్రధానంగా మారడంతో షూటింగ్‌లు వాయిదా పడ్డాయి.