ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు చూస్తున్నారో దర్శకనిర్మాతలకే అర్థం కావడం లేదు.ఏ జానర్ సినిమాలు హిట్ అవుతున్నాయో ఏ జానర్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయో అర్థం చేసుకోవడం దర్శకనిర్మాతలకు సాధ్యం కావడం లేదు.
అయితే డ్యూయల్ రోల్స్, ఊరమాస్ రోల్స్ లో మెప్పించడం బాలయ్య( Balakrishna )కు మాత్రమే సాధ్యమవుతోంది.రొటీన్ కథలతో కూడా బాలయ్య విజయాలు అందుకుంటున్నాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
బాలయ్య నటించి సక్సెస్ సాధించిన చాలా సినిమాల సక్సెస్ కు బాలయ్య యాక్టింగ్ కారణమని చెప్పడంలో అతిశయోక్తి లేదు.సరైన పాత్ర పడితే బాలయ్య తన నటనతో మ్యాజిక్ చేస్తారు.బాలయ్య గత సినిమాల ద్వారా ఈ విషయం ప్రూవ్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.మరో హీరో ఇలాంటి రోల్స్ లో నటించినా పెద్దగా ఫలితం ఉండదని బాలయ్య రేంజ్, క్రేజ్ వేరే లెవెల్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు.
బాలయ్య ప్రస్తుతం బాబీ డైరెక్షన్( Bobby ) లో ఒక సినిమాలో నటిస్తుండగా ఈరోజు ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ కానుంది.బాలయ్య బాబీ మూవీ గ్లింప్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాల్సి ఉంది.గ్లింప్స్ తో పాటు ఈ సినిమా టైటిల్, రిలీజ్ డేట్ వివరాలను సైతం మేకర్స్ వెల్లడిస్తారేమో చూడాలి.బాలయ్య బాబీ కాంబో మూవీ మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ తెరకెక్కిందని సమాచారం అందుతోంది.
ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.సమ్మర్ తర్వాత ఈ సినిమా విడుదలవుతుందా? లేక దసరా కానుకగా విడుదలవుతుందా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.ఈ సినిమా హిట్టైతే బాలయ్య బాబీ కాంబోలో మరిన్ని సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.బాలయ్య ఈ సినిమా కోసం 30 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్( Remuneration ) అందుకుంటున్నారు.
వీరసింహారెడ్డి( Veera Simha Reddy ) సినిమాకు అందుకున్న పారితోషికంతో పోల్చి చూస్తే ఈ మొత్తం డబుల్ కావడం గమనార్హం.బాలయ్యకు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు దక్కుతుండటం ఫ్యాన్స్ కు సైతం సంతోషాన్ని కలిగిస్తోంది.