ఏ క్యారెక్టర్ అయిన నేను చేయడానికి రెఢీ అంటున్న బలగం బ్యూటీ...

టాలీవుడ్ లో చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి హిరోయిన్ గా రాణిస్తున్నారు.అలాంటి వారిలో కావ్య కళ్యాణ్ ( Kavya Kalyan Ram )ఒక‌రు.

 Balagam Heroine Kavya Kalyan Ram Comments Viral On Social Media, Kavya Kalyan-TeluguStop.com

స్టార్ హీరోల సినిమాల్లో బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ముఖ్యంగా గంగోత్రీ, ఠాగూర్ మరియు బాలు లాంటి సినిమాల్లో కనిపించిన కావ్య.

ఆ తరువాత వెండితెరకు కొద్దిగా గ్యాప్ ఇచ్చింది.ఇక ఆ మధ్య హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మ‌డు.ప్రస్తుతం వరుస సినిమాలతో ఆమె బిజీగా మారింది.2022లో వచ్చిన ఉస్తాద్‌ అనే సినిమాతో హీరోయిన్ గా మారింది ఈ బాలనటి.మసూద, బలగం అలాగే తాజాగా పరేషాన్ వంటి బ్లాక్‌ బాస్టర్‌ సినిమాల్లో లీడ్‌ రోల్స్‌ ను చేసింది.

 Balagam Heroine Kavya Kalyan Ram Comments Viral On Social Media, Kavya Kalyan-TeluguStop.com
Telugu Balagam, Priyadarshi, Tollywood-Movie

మరీ ముఖ్యంగా బలగం సినిమాతో కావ్యకు మంచి గుర్తింపు అయితే వచ్చింది.ఆ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలకు బాగా నచ్చేసింది.దాంతో కావ్య కూడా ఓవర్‌ నైట్‌ స్టార్‌ గా మారింది.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీ అయిపోయింది కావ్య.అయితే ప్రస్తుతం వరుస ఆఫర్లు వస్తుండటంతో ఆమె కమర్షియల్ హీరోయిన్ గా చేయడానికి కూడా రెడీ అయిపోయింది.

ఈ క్రమంలో ఆమె చేసిన కొన్ని కామెంట్లు సోషల్‌ మీడియా( Social media )లో బాగా వైరల్ గా మారాయి.సినిమాల్లో తాను నటించే విషయంలో చాలా బోల్డ్ కామెంట్స్ ను చేసింది.

Telugu Balagam, Priyadarshi, Tollywood-Movie

కావ్య మాట్లాడుతూ.డబ్బులు ఎక్కువ ఇస్తే చాలు ఎలాంటి సీన్లలో నటించడానికైనా కూడా తాను సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చింది.మంచి నటిగా నిరూపించుకోవాలంటే అన్ని రకాల సీన్లలో నటించాలని ఆమె అన్నారు.అలా నటించగలిగినప్పుడే సంపూర్ణ నటిగా తనకు మంచి గుర్తింపు వస్తుందని కావ్య చెప్పాకొచ్చారు. ఇండస్ట్రీలో లిప్‌లాక్‌ సీన్స్‌ అలాగే బెడ్‌ సీన్ల కోసం హీరోయిన్లు ఎక్కువ రెమ్యూనరేషన్‌( Remuneration ) తీసుకుంటున్నారని.తాను కూడా మంచి కథ ఉంటే అలాంటి సీన్లలో నటించడానికి సిద్ధం అని చెప్పుకొచ్చింది.

అయితే అలాంటి సీన్లలో నటించడానికి ఎక్కువ డబ్బు తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube