స్టార్ హీరో బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు.మాస్ సినిమాలతో బాలయ్య వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్నారు.
బాలయ్య నటించిన అఖండ సినిమా అంచనాలను మించి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తుండగా సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరగనుందని తెలుస్తోంది.
ప్రముఖ నటుడు బాబు మోహన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలయ్య గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.భైరవద్వీపంలో బాలయ్య బాబు గుర్రపు సీన్లలో అద్భుతంగా చేశారని తాను చెప్పానని అయితే తాను చేసిన కామెంట్లను కొంతమంది తప్పుగా కూడా ప్రచారం చేశారని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.
బాలయ్యకు తప్ప ఏ హీరోకు హార్స్ రైడింగ్ రాదని తాను చెప్పానని ప్రచారం చేశారని బాబు మోహన్ వెల్లడించారు.
గుర్రాన్ని రైడ్ చేయడంలో బాలయ్య బాబు మొండిగా వ్యవహరిస్తాడని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.బాలయ్య బ్రహ్మాండమైన హార్స్ రైడర్ అని అతనికి భయం అంటూ ఏమీ ఉండదని బాబు మోహన్ పేర్కొన్నారు.బాలయ్య గుర్రాలతో ఆడుకుంటాడని బాలయ్య చాలా జోవియల్ గా ఉంటాడని బాబు మోహన్ వెల్లడించారు.
బాలయ్య బాబును చూస్తే గుర్రాలు భయపడతాయని బాబు మోహన్ అన్నారు.
నాకు హార్స్ రైడింగ్ అంతగా రాదని బాబు మోహన్ వెల్లడించారు.చిరంజీవిగారు కూడా బ్రహ్మాండంగా హార్స్ రైడింగ్ చేస్తారని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.బాలయ్య కోపిష్టి అనే కామెంట్ల గురించి బాబు మోహన్ స్పందిస్తూ నచ్చని పనులు చేస్తే ఎవరైనా కోప్పడతారని వెల్లడించారు.
బాలయ్య ప్రస్తుతం మాస్ కథాంశాలతో తెరకెక్కే సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం.సినిమాసినిమాకు బాలయ్యకు క్రేజ్ పెరుగుతుండగా బాలయ్య కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.