జలుబును తగ్గించే అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు

కాలం మారుతుంది.వర్షాలు ప్రారంభం అయ్యాయి.

 Ayurvedic Remedies For Fighting The Cold, Cold, Ayurvedic , Tips ,ayurvedic Reme-TeluguStop.com

ఇలా సీజన్ మారినప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.ఆ సమస్యల్లో ఒకటి జలుబు.

జలుబు వచ్చిందంటే ఒక పట్టాన వదలదు.జలుబు రాగానే చాలా మంది ఇంగ్లిష్ మందులను వేసుకుంటూ ఉంటారు.

అయితే ఆ మందుల వలన ప్రయోజనం కొంతవరకు మాత్రమే ఉంటుంది.ఆలా కాకుండా కొన్ని ఆయుర్వేద చిట్కాల ద్వారా సులభంగా జలుబు నుండి బయట పడవచ్చు.

ఇప్పుడు ఆ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.

వెల్లుల్లి రెబ్బను నలిపి వాసన చూస్తూ ఉండాలి.

ఇలా రెండు గంటలకు ఒకసారి వాసన చూస్తే మంచి ఫలితం కనపడుతుంది.అలాగే ఒక వెల్లుల్లిని తినాలి.

అయితే గ్యాస్ ఉన్నవారు పచ్చి వెల్లుల్లిని తినకూడదు.ఒక కప్పులో నీటిలో ఒక స్పూన్ బార్లీ గింజలను వేసి ఉడికించి ఆ నీటిని వడకట్టాలి.

ఈ నీటిలో నిమ్మరసం కలిపి త్రాగితే జలుబు తగ్గటమే కాకుండా గొంతు మంట కూడా తగ్గుతుంది.

లేత దానిమ్మ ఆకులను నలిపి వాసన చూస్తూ ఉంటే తొందరగా జలుబు తగ్గుముఖంపడుతుంది.

ఈ విధంగా రోజులో మూడు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.క్యాబేజి కూడా జలుబును తగ్గించటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.

ఒక కప్పు నీటిలో క్యాబేజీని ఉడికించి ఆ నీటిని త్రాగాలి.ఈ విధంగా రోజులో రెండు సార్లు చేయాలి.

ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు,మిరియాల పొడి వేసుకొని త్రాగితే జలుబు మాయం అయ్యిపోతుంది.ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

Ayurvedic Remedies For Fighting The Cold, Cold, Ayurvedic , Tips ,ayurvedic Remedies, Ayurvedic Remedies For Cold - Telugu Ayurvedic, Tips

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube