సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అంచెలంచెలుగా ఎదుగుతూ యూత్ కు ఇన్సిపిరేషన్ గా నిలుస్తున్నారు.ఇప్పటికే రౌడీవేర్,ప్రొడక్షన్ హౌస్, ఎలక్ట్రిక్ వెహికిల్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఇప్పుడు థియేటర్ రంగంలోకి అడుగుపెట్టాడు.
ప్రేక్షకులకు టాప్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ ని అందించేందుకు ఏ.వి.డి సినిమాస్ పేరుతో తన సొంత ఊరు మహబూబ్ నగర్ లో థియేటర్ ఓపెన్ చేశాడు.డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిషన్,థియేటర్ రంగాలలో సుదీర్ఘ అనుభవాన్ని సొంతం చేసుకున్న ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యం లో విజయ్ దేవరకొండ కలిసి నిర్మించిన ఎవిడి సినిమా మల్టిప్లెక్స్ ఈ రోజు ప్రారంభం అయ్యింది.
మూడు థియేటర్స్ సముదాయం గా నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ టాప్ క్లాస్ సినిమా అనుభవాన్ని ప్రేక్షకులకు అందించబోతుంది.డాల్బీ అట్మాస్, లగ్జరీ సీటింగ్ వంటి అధునాతన హంగు లతో అత్యుత్తమ థియేటర్ ఎక్స్ పీరియన్స్ అందించ బోతుంది ఎవిడి సినిమాస్.
ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు దేవరకొండ మాట్లాడుతూ : మేము పుట్టి పెరిగిన చోట ఇలాంటి మల్టిప్లెక్స్ నిర్మాణం లో భాగం అవడం చాలా సంతోషంగా ఉంది.విజయ్ కి ఈ మల్టి ప్లెక్స్ చాలా స్పెషల్.
ఏషియన్ సునీల్ గారి భాగస్వామ్యం మాకు చాలా ఆనందకరం గా ఉంది.టాప్ క్లాస్ ఎంటర్ టైన్మెంట్ ఇక్కడ దొరుకుతుంది.
అందరూ దీన్ని ఎంజాయ్ చేస్తారు’’.అన్నారు.
ఏషియన్ సినిమాస్ అధినేత నారాయణ దాస్ నారంగ్ మాట్లాడుతూ : ప్రేక్షకులకు మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ అందించాలనే మెహబూబ్ నగర్ లో ఏ.వి.డి సినిమాస్ ను నిర్మించాము.మాతో భాగస్వామ్యం అయిన హీరో విజయ దేవరకొండ కు కృతజ్ఞతలు.
సినిమా అనుభవం సంపూర్ణంగా థియేటర్ లొనే కలుగుతుంది.మహబూబ్ నగర్ కే కాదు , చుట్టుపక్కల జిల్లాలకు కూడా ఏ.వి.డి ఎంటర్టైన్మెంట్ హబ్ అవుతుంది అన్నారు.
నిర్మాత,డిస్ట్రిబ్యూటర్ శిరీష్ రెడ్డి మాట్లాడుతూ .ఏషియన్ సినిమాస్- విజయదేవరకొండ భాగస్వామ్యం లో నిర్మించిన ఈ ఏ.వి.డి సినిమాస్ చాలా బాగుంది.మంచి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని ఆడియెన్స్ ఎప్పుడూ కోరుకుంటారు.ఇప్పుడు వారికి అందుబాటులో ఒక టాప్ క్లాస్ మల్టిప్లెక్స్ ఉంది.ఓ డిస్ట్రిబ్యూటర్ గా ఇలాంటి థియేటర్ ప్రారంభించడం చాలా సంతోషకరం.
ఏషియన్ సునీల్ నారంగ్ మాట్లాడుతూ : మంచి థియేటర్ ఎక్స్ పీరియన్స్ అందించాలనే మా ప్రయత్నం లో హీరో విజయ దేవర కొండ భాగస్వామ్యం అయినందుకు కృతజ్ఞతలు.ఏ.వి.డి సినిమాస్ లో ప్రదర్శించే మొదటి సినిమా మా సంస్థ లో నిర్మించిన ‘‘లవ్ స్టోరి’’ అవడం చాలా ఆనందం గా ఉంది.మెట్రో సిటీస్ లో పొందే థియేటర్ ఎక్స్ పెరియన్స్ కి ధీటు గా ఈ మల్టీప్లెక్స్ ను నిర్మించాము.
ఇది తప్పకుండా మహబూబ్ నగర్ కి ఎంటర్టైన్మెంట్ హబ్ అవుతుంది.’’ అన్నారు
.