పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాల నిర్వహకులు దౌర్జన్యంగా ప్రవర్తించారు.ఉండి మండలం యండగండిలో పందెం రాయుళ్లు పోలీసులపై దాడికి పాల్పడ్డారు.
కోడి పందాలు నిర్వహిస్తున్నారని 112 కాల్ సెంటర్ కు ఫోన్ రావడంతో పోలీసులకు సమాచారం వచ్చింది.దీంతో కానిస్టేబుళ్లు రత్నం, శ్రీనివాసులు కోడి పందాల స్థావరాల వద్దకు వెళ్లారు.
అక్కడ బొంతు లాజరు, మరో పదకొండు మంది పందాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.ఈ క్రమంలో పందెం రాయుళ్లను కానిస్టేబుళ్లు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.
తీవ్ర ఆగ్రహానికి గురైన పందెం రాయుళ్లు పోలీసులపై దాడికి పాల్పడటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.