సల్మాన్ ఖాన్ కు పెళ్లి యోగం లేదంటున్న పండితుడు..?

బాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ల జాబితాను పరిశీలిస్తే అందులో సల్మాన్ ఖాన్ పేరు ముందువరసలో ఉంటుంది.54 ఏళ్ల సల్మాన్ ఖాన్ నటించే సినిమాల కంటే పెళ్లి వార్తలే ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి.ఆయన అభిమానులు సల్మాన్ ఈ జన్మలో పెళ్లి చేసుకోరనే అభిప్రాయానికి వచ్చేశారు.సల్మాన్ ప్రస్తుతం సినిమాలతో పాటుబిగ్ బాస్ సీజన్ 14 హోస్ట్ గా చేస్తున్నారు.బిగ్ బాస్ సీజన్ 14లో ఒక్కో ఎపిసోడ్ కు 16 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

 Astrologer On Salman Khan Marriage, Salman Khan Marriage, Doshams, Salman Khan J-TeluguStop.com

సల్మాన్ హోస్ట్ చేసే ఈ షోను ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే తేడాల్లేకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల బిగ్ బాస్ ప్రేమికులు ఆదరిస్తూ ఉంటారు.

ఇటీవల బిగ్ బాస్ సీజన్ 14 ప్రారంభం కాగా షో లాంఛింగ్ ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఓ పండితుడు ఈ షోకు హాజరై షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు.

పనిలో పనిగా ఆ పండితుడు సల్మాన్ జాతకం చెబుతూ ఆయన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సల్మాఖ్ ఖాన్ కు ప్రస్తుతం పెళ్లి యోగం లేదని.

గ్రహాలు సరిగ్గా లేనందువల్లే పెళ్లి జరగడం లేదని వెల్లడించారు.భవిష్యత్తులో కూడా సల్మాన్ కు పెళ్లి జరగకపోవచ్చని కామెంట్లు చేశారు.

సల్మాన్ జాతకంలో కొన్ని దోషాలు ఉన్నాయని పెళ్లి జరగకపోవడానికి జాతకం కూడా ఒక కారణమని చెప్పారు.పండితుడు ఇక జన్మలో పెళ్లి కాదని చెప్పడంతో సల్మాన్ ఖాన్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడం గమనార్హం.

సల్మాన్ పెళ్లి గురించి ప్రతిరోజూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్ పరోక్షంగా తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని బిగ్ బాస్ వేదికగా చెప్పడనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఏదేమైనా తమ అభిమాన హీరో పెళ్లిపై ఆసక్తి చూపించకపోవడంతో సల్మాన్ అభిమానులు మాత్రం బాధ పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube