మహేష్ బాబు ముందు బీర్ తాగినప్పుడు అంటూ సీక్రెట్ బయటపెట్టిన హీరో?

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడిగా, ఒకవైపు పొలిటికల్ సపోర్ట్, మరొకవైపు ఘట్టమనేని ఫ్యామిలీ సపోర్ట్ ద్వారా తన అదృష్టాన్ని మొదటిసారి పరీక్షించుకో బోతున్నాడు హీరో అశోక్ గల్లా.టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.అశోక్ గల్లా తాజాగా హీరోగా నటించిన చిత్రం హీరో.ఈ సినిమాలో అశోక్ గల్లా సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.ఇక అశోక్ గల్లా హీరో గా నటించిన హీరో సినిమా జనవరి 14న సంక్రాంతి పండుగకు విడుదల కానుంది.

 Ashok Galla About Mahesh Babu Ashok Galla,  Hero Movie,  Mahesh Babu,  Drink Bee-TeluguStop.com

ఇక ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పలు రకాల అంశాలను ప్రమోషన్స్ లో భాగంగా హైలెట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే అశోక్ గల్లా తన ఫ్యామిలీకి సంబంధించిన పర్సనల్ విషయాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.తాజాగా ఇంటర్వ్యూలో అశోక్ గల్లా మాట్లాడుతూ.అశోక్ తన మామ మహేష్ బాబు తో కూర్చుని బీరు కూడా తాగినట్టు తెలిపాడు.తనకు 18 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఒకసారి ఇంట్లోనే మహేష్ పక్కన ఉండగానే బీరు తీసుకొని తాగాను అని చెప్పుకొచ్చాడు అశోక్.

ఆ సమయంలో మహేష్, అశోక్ ని ఒక డిఫరెంట్ లుక్ తో చూశాడట.

Telugu Ashok Galla, Beer, Mahesh Babu, Nidhi Agrawal, Tollywood-Movie

అంతేకాకుండా బీర్ తాగుతావా అని మహేష్ అడిగినప్పుడు అశోక్ ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయాడట.ఇక ఇంటర్వ్యూలో అశోక్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే అశోక్ తన మామయ్య మహేష్ బాబు తో చాలా క్లోజ్ గా ఉంటాడు అని అర్థం అవుతోంది.అంతేకాకుండా మహేష్ బాబు ఇంట్లో చాలా కూల్ గా ఉంటూ, అల్లరి అల్లరి చేస్తూ పిల్లలతో బాగా కలిసి పోతూ ఉంటారు అని చెప్పుకొచ్చాడు అశోక్.

తనకు తెలిసినంతవరకూ తన జీవితంలో మహేష్ బాబు లాంటి వ్యక్తిని చూడలేదు అని అశోక్ వెల్లడించారు.అశోక్ నటించిన హీరో సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా, కృష్ణ గల్లా అరుణ కుమారి సమర్పణలో గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న థియేటర్లలో విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube