తమకు పని వత్తిడిని తగ్గించకుంటే అసెంబ్లీని, ప్రగతి భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు హైదరాబాద్ ఆశావర్కర్లు.సీఐటీయూ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని డి ఎం హెచ్ ఓ కార్యాలయం ముందు ఆశావర్కర్లు ధర్నా చేశారు.
ఆశా వర్కర్లకు పని భారం తగ్గించాలని కనీస వేతనం పెంచాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సీఐటీయూ నాయకురాలు వాణి మాట్లాడుతూ కోవిడ్ సమయం నుంచి ఇప్పటి వరకు కూడా పనిభారం ఒత్తిడి వల్ల ఆశ వర్కర్లు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారుకేవలం 7వేల రూపాయలతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
వాళ్లకు జాబ్ చార్ట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఫిక్స్డ్ వేతనం పదివేల తో పాటు కనీస వేతనం 21 చేయాలని డిమాండ్ చేసారు.ఆంధ్ర ప్రభుత్వం ఏదైతే 10,000 వేతనం ఇస్తున్నారో తెలంగాణ ప్రభుత్వం కూడా అదే విధంగా ఆశ వర్కర్లకు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
లేనిచో ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము లేనియెడల ఉద్యమాన్ని ఉదృతం చేసి అసెంబ్లీని, ప్రగతి భవనాన్ని సైతం ముట్టడిస్తామని హెచ్చరించారు
.