ఏపీ ప్రభుత్వ సిట్‎పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం

అమరావతి భూముల కొనుగోళ్లు, గత ప్రభుత్వ నిర్ణయాలపై ఏపీ ప్రభుత్వం చేసిన సిట్ విషయంలో సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది.ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

 Arguments Concluded On The Ap Government's Sit.. The Supreme Court Reserved Judg-TeluguStop.com

అమరావతిలో భూముల కొనుగోళ్లు, గత ప్రభుత్వం యొక్క విధాన పరమైన, ఆర్థిక పరమైన నిర్ణయాలతో పాటు ఇతర అంశాలపై విచారణ చేపట్టేందుకు ఏపీ సర్కార్ గతంలో సిట్ ను ఏర్పాటు చేసింది.అయితే ఈ నిర్ణయాన్ని వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ లు సవాల్ చేయడంతో సెప్టెంబర్ 15న హైకోర్టు స్టే విధించింది.

దీంతో హైకోర్టు స్టే ను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లింది.నిన్న ఏపీ ప్రభుత్వం వాదనలు ముగియగా.

ఇవాళ ప్రతివాదుల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు.ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube