టాలీవుడ్ సూపర్ స్టార్ తాజాగా మంగళవారం రోజున ఉదయం గుండెపోటుతో మరణించిన విషయం మనందరికీ తెలిసిందే.సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనయింది.
కాగా సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్తను ఇప్పటికీ అయిన అభిమానులు, ఘట్టమనేని ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోతున్నారు.ఇక సూపర్ స్టార్ కృష్ణ ని చివరి చూపు కోసం ఎంతో దూరం నుండి వేలాదిమంది అభిమానులు హైదరాబాద్ కి తరలి వచ్చారు.
అంతే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ ఇంటిని కూడా చుట్టూ ముట్టేసారు అభిమానులు.
దీంతో అభిమానులను కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టతరంగా మారింది.
ఇకపోతే సూపర్ స్టార్ కృష్ణ కి ఉన్న అభిమానులలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు.మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ కృష్ణకు ఫ్యాన్ ఏంటా అని అనుకుంటున్నారా.
మీరు విన్నది నిజమే మెగాస్టార్ చిరంజీవి సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వకముందు సూపర్ స్టార్ కృష్ణ ని ఆరాధించే వారట.ఇక అప్పట్లో హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న కృష్ణకు ఏ హీరోకి లేనివిధంగా అభిమాన సంఘాలు ఉండేవట.
అప్పట్లోనే కృష్ణకు ఏకంగా 2500 అభిమాన సంఘాలు ఏర్పడ్డాయట.
మరే ఇతర హీరోకి లేనివిధంగా భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు కృష్ణ.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళనాడు కర్ణాటక ఇలా వివిధ భాషల్లో కూడా సూపర్ స్టార్ కృష్ణ కి అభిమానులు అభిమాన సంఘాలు ఉండేవట.ఇక అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి కృష్ణ అభిమానుల సంఘానికి అధ్యక్షుడిగా ఉండేవారు.
ఆ విషయం గురించి చిరంజీవి మాట్లాడుతూ.సూపర్ స్టార్ కృష్ణ నుండి ప్రేరణను పొంది సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు.
కాగా అప్పట్లో అనగా 1981లో కృష్ణా నటించిన తోడుదొంగలు సినిమా విడుదలకు ముందు పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ పేరుతో కొన్ని కరపత్రాలు విడుదల అయ్యాయి.ఆ కరపత్రాలకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కరపత్రాల్లో అభిమాన సంఘానికి చిరంజీవి గౌరవ అధ్యక్షుడిగా ఉండేవారు అని రాసి ఉంది.కాగా అందుకు సంబంధించిన పేపర్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.