350 సినిమాలు తీసిన అనుభవం కృష్ణకు ఉంది.ఏ సినిమా చూసినా కూడా అది ఎన్ని రోజులు ఆడుతుందో ఖచ్చితంగా చెప్పగలడు కృష్ణ.
అలాంటిది తన కొడుకు రమేష్ బాబుని మాత్రం స్టార్ హీరోగా నిలబెట్టలేకపోయాడు.ఇక మహేష్ బాబు కూడా చిన్నతనంలో చేసిన సినిమాలన్నీ విజయం సాధించిన హీరోగా చేసాక ఆదిలోనే కొన్ని ఫ్లాపులు చవిచూడాల్సి వచ్చింది.
అందులో ముఖ్యంగా మొదటి సినిమా రాజకుమారుడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రీతి జింతా నటించగా రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు.
సినిమా కాస్త పర్వాలేదనిపించుకున్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే కాలేదు, అందుకు ప్రధాన కారణం మహేష్ బాబు కన్నా ప్రీతిజింతా కాస్త ముదురుగా కనిపించడం.
ఇక ఆ తర్వాత యువరాజు సినిమా వచ్చింది.
ఇది వైజయంతి మూవీస్ వారు తెరకెక్కించారు.ఇది కూడా ఆ పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ ఏమి కాదు.
ఒక యావరేజ్ సినిమా ఈ సినిమాలో సాక్షి శివానంద్, సిమ్రాన్లు హీరోయిన్స్ గా నటించారు.వాళ్ళిద్దరూ కూడా మహేష్ బాబు కన్నా ముదురు హీరోయిన్లుగా కనిపించడం తో చాలా గందరగోళం ఏర్పడి ఈ సినిమా ఫ్లాప్ అయింది.
ఆ తర్వాత వంశీ. ఇందులోనే నమ్రత మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది.దాంతో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మొదలైంది.ఆ తర్వాత ప్రేమ, పెళ్లి లాంటివి జరిగాయి.కానీ ఇది పద్మాలయ బ్యానర్స్ సొంత సినిమా కావడంతో ఇండస్ట్రీలో బాగా చర్చ జరిగింది.ఈ సినిమా కూడా పెద్ద హిట్ ఏమీ కాదు.

ఆ తర్వాత ఆ కృష్ణవంశీ దర్శకత్వంలో మురారి సినిమా వచ్చి ఒక రేంజ్ హిట్టు కొట్టే వరకు మహేష్ బాబుకి సరైన హిట్టు లేదనే చెప్పాలి.కానీ రమేష్ బాబుని హీరోగా చేయలేకపోయాడు మహేష్ ని ఏం చేస్తాడులే అనుకున్నవారికి కృష్ణ గట్టిగానే సమాధానం చెప్పేవాడు.మహేష్ బాబు సినిమాలు ఫెయిల్ అవ్వడానికి కారణం మహేష్ బాబుకు నటించడం రాక కాదు అంటూ చెప్పాడు.తన కొడుకుని బాగా నమ్మాడు.ఆ తర్వాత మురారి చిత్రం విజయ సాధించడంతో మహేష్ నిలబడ్డాడు.ఇక మళ్ళీ నాని, బాబి, నిజం అంటే సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఒక్కడు, పోకిరి, అతడు సినిమాలు మహేష్ బాబును ఒక స్టార్ హీరోగా నిలబెట్టాయి.

ఆ తర్వాత ఆ మహేష్ బాబు ప్రతి సినిమాకు అతడి రేంజ్ పెరుగుతూనే వస్తుంది.ఇంక మళ్ళీ స్పైడర్ తో కొన్నాళ్లపాటు గ్రహణం మొదలైనట్టుగా అనిపించిన మహర్షి, సర్కారు వారి పాట లాంటి సినిమాలు అతనికి నిలబెట్టాయి.ఇక తండ్రి లాగా వందల సినిమాలు చేయకపోయినా 23 ఏళ్ల కాలంలో కేవలం 27 సినిమాలు మాత్రమే తీశారు మహేష్ బాబు. వీటికి మించి వ్యాపారాలు, కుటుంబం, నటన అన్నింటిని బ్యాలెన్స్ చేస్తున్నాడు.
రమేష్ ను తిరస్కరించిన ప్రేక్షకులు మహేష్ ని యాక్సెప్ట్ చేశారు.అందుకు తండ్రిగా కృష్ణ ఎంతో ఆరాటపడ్డాడని చెప్పాలి
.






