ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జే ట్యాక్స్ కోసం ఆక్వా రంగాన్ని జగన్ నాశనం చేశారని ఆరోపించారు.
ఏపీ సీడ్ యాక్ట్ తో రైతుల మెడలకు ఉరితాళ్లు బిగిస్తున్నారని విమర్శించారు.ప్రభుత్వం, ఎగుమతి దారులు కుమ్మక్కయ్యారన్నారు.
ఏసీ రూమ్ లలో కూర్చుని మంత్రుల కమిటీ నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు.ఎప్పుడైనా మంత్రి సీదిరి అప్పలరాజు ఫీల్డ్ లోకి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారా అని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో ఆక్వా రైతుల పక్షాన టీడీపీ పోరు కొనసాగుతుందని పేర్కొన్నారు.వారికి న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని ఆపేది లేదని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.