గూగుల్ పే యాప్ ని రీప్లేస్ చేయబోతున్నారా? ఈ మార్పులు దేనికోసం!

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఎట్టకేలకు సరికొత్త గూగుల్ వాలెట్ సర్వీసులను ప్రకటించి సంచలం సృష్టించింది.వీటి ద్వారా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, డిజిటల్ ఐడీలు, డాక్యుమెంట్లు ఇలా చాలా వాటిని గూగుల్ వాలెట్‌లో భద్రం చేయొచ్చు.

 Are You Going To Replace The Google Pay App  Why These Changes , Google Pay, App-TeluguStop.com

అంతేకాకుండా, పలు ప్రాంతాల్లో గూగుల్ పే యాప్‌ స్థానంలో గూగుల్ వాలెట్ అందుబాటులోకి తెస్తోంది గూగుల్ కంపెనీ.ఇకపై కొన్ని దేశాల్లో గూగుల్ పే యాప్ కనిపించదు.

అయితే ఈ విషయాన్ని గూగుల్ అధికారికంగా వెల్లడించడం విశేషం.పలు దేశాల్లో గూగుల్ పే స్థానంలో గూగుల్ వాలెట్ సేవలు అందుబాటులో రానున్నాయని సమాచారం.

అయితే, డిజిటల్ IDలను ఇక్కడ స్టోర్ చేయడం కష్టంగా ఉండొచ్చు.ఇక్కడ చాలా నియమ నిబంధనలు ఉంటాయి.అయితే గూగుల్ ఏం చేస్తుందో వేచి చూడాలి మరి.డ్రైవర్ లైసెన్స్, స్టేట్ ఐడీలు, కార్డులు, డాక్యుమెంట్లు, ఫ్లైట్ బోర్డింగ్ పాస్‌లు ఇలా చాలా వాటిని డిజిటల్ రూపంలో గూగుల్ వాలెట్‌లో కలిగి ఉండొచ్చని సమాచారం.ఇంకా హోటల్ కీస్, కంపెనీల బ్యాడ్జెస్ వంటి వాటికి కూడా వాలెట్ ఉపయోగించుకోవచ్చు.అంటే ఫోన్ ద్వారా చాలా పనులు పూర్తి అయిపోతాయి.గూగుల్ ఈ సేవల కోసం పలు థర్డ్ పార్టీ సంస్థలతో భాగస్వామ్యం కుదురుచుకోవాలని అనుకోవడం హర్షణీయం.

Telugu Google Pay, Google Wallet, Latest, Replace-Latest News - Telugu

ఇకపోతే కంపెనీ గూగుల్ పే సర్వీసులను మాత్రం పూర్తిగా తొలగించదు.గూగుల్ పే, గూగుల్ వాలెట్ సేవలు రెండూ కూడా అందుబాటులోనే ఉంటాయి.యాపిల్ వాలెట్, యాపిల్ పే మాదిరిగా గూగుల్ కూడా రెండు సేవలను కొనసాస్తుంది.

అయితే చాలా వరకు దేశాల్లో మాత్రం గూగుల్ పే ఉండదు.భారత్‌లో గూగుల్ పే ఉంటుంది.

అదనంగా వాలెట్ యాప్ అంటూ ఏమీ ఉండకపోవచ్చు.ఎందుకంటే మన దేశంలో గూగుల్ పే యాప్‌ను చాలా మంది వినియోగిస్తున్నారు కనుక.

కాబట్టి భరత్ లాంటి దేశాలలో గూగుల్ పే అనేది విరివిగా వినియోగిస్తున్నారు.కనుక ఈ రెండు సేవలను తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube