వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక విషయంలో అధికార పార్టీ వైసిపి అన్ని పార్టీలకంటే ముందుంది.ఇప్పటికే ఐదు విడతలుగా అభ్యర్థుల జాబితా విడుదల చేయగా, త్వరలోనే టీడీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) సిద్ధమవుతున్నారు.
ఇంకా చర్చలు జరుగుతున్నాయి.వీలైనన్ని ఎక్కువ స్థానాలను పొత్తులో భాగంగా తీసుకోవాలని జనసేన( Janasena ) ప్రయత్నిస్తుండగా, వీలైనంత తక్కువ స్థానాలను జనసేనకు ఇచ్చే విధంగా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు.
ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎలా ఉన్నా, వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు తమ రెండు పార్టీలు కలిసే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఈ నేపథ్యంలో జనసేనకు కేటాయించబోయే నియోజకవర్గాల విషయంలో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
టిడిపి ( TDP ) నుంచి 60 కి తగ్గకుండా సీట్లను తీసుకోవాలని జనసేన భావిస్తోంది.ఈ విషయంపై పవన్ పైన( Pawan Kalyan ) పార్టీ నేతల నుంచి ఒత్తిడి ఉంది.
అయితే టిడిపి మాత్రం 20 నుంచి 30 స్థానాలను జనసేనకు కేటాయించాలనే ఆలోచనతో ఉంది.ఈ విషయంలో మరోసారి రెండు పార్టీల అధినేతల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది.జనసేనకు పొత్తులో భాగంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాలు దక్కే అవకాశం ఉంది.దీంతోపాటు ఉత్తరాంధ్ర ,రాయలసీమ జిల్లాల్లోనూ జనసేనకు కొన్ని సీట్లను కేటాయించాలని బాబు నిర్ణయించుకున్నారట.చిత్తూరు జిల్లాలోని( Chittoor ) మదనపల్లి, తిరుపతి, కర్నూలు జిల్లాలో( Kurnool ) ఒక స్థానం, కడప, అనంతపురంలో ఒక్కో సీటును కేటాయించాలని,
అలాగే ఒంగోలు( Ongole ) జిల్లాలోని దర్శితోపాటు ,చీరాల, నెల్లూరులోని నెల్లూరు రూరల్ లేదా మరో స్థానాన్ని జనసేన కు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇక గుంటూరు లో రెండు, కృష్ణ లో రెండు సీట్లు ఇవ్వాలని బాబు భావిస్తున్నారట.అలాగే దాదాపు 10 స్థానాల వరకు ఉభయగోదావరి జిల్లాలో ఇచ్చే అవకాశం ఉందని, ఉత్తరాంధ్రలో ఆరు స్థానాలు వరకు జనసేనకు కేటాయించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది .దీంతోపాటు రెండు నుంచి మూడు పార్లమెంట్ స్థానాలను జనసేన పొత్తులో భాగంగా కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.