వైరల్‌: అపోలో టైర్స్‌ యాడ్‌ చూశారా? రక్షాబంధన్‌ అందరిదీ అంటూ!

రక్షా బంధన్( Raksha Bandhan ) గురించి తెలుగు జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రక్షా బంధన్ అంటే రక్షణ.

 Apollo Tyres Raksha Bandhan Ad A Heartwarming Video Viral Details, Viral News, A-TeluguStop.com

బాధ్యతకు ప్రతీక అని అర్ధం.సోదరులు, సోదరీమణుల మధ్య బంధాన్ని మాత్రమే కాకుండా మనిషికి మనిషికీ మధ్య ఉంటే బంధానికి రక్షణగా ఈ పండగను పేర్కొంటారు.

ఈ నమ్మకాన్నే పునరుద్ఘాటిస్తూ ప్రముఖ టైర్ల కంపెనీ అపోలో టైర్స్( Apollo Tyres ) రక్షా బంధన్‌పై తాజాగా ఓ అద్భుతమైన యాడ్‌ను రూపొందించింది.కాగా ఈ యాడ్‌ ఇపుడు నెటిజనుల మనసుని దోచుకుంటోంది.

Telugu Apollo Ad, Latest, Rakhi, Rakshabandhan, Short, Truck-Latest News - Telug

అవును, అపోలో టైర్స్ రక్షా బంధన్ సారాంశాన్ని షార్ట్ ఫిల్మ్‌ ద్వారా స్పెషల్‌గా అప్లోడ్ చేసింది.రక్షా బంధన్ ప్రతి ఒక్కరి కోసం అంటూ ఈ స్టోరీని ఎంతో అందంగా, ఆద్యంతం హృద్యంగా వివరించింది.ఇంతకీ ఈ షార్ట్ ఫిల్మ్‌ లో( Short Film ) ఏముందంటే.ఒక యువతి రక్షా బంధన్ రోజున తన ఇంటికి కారులో వెడుతూ ఉంటుంది.ఈ క్రమంలో ఒక ట్రక్కు తనను తాను వెంబడిస్తూ, హారన్‌మోగిస్తూ ఉంటాడు.దీంతో ఆమె అసౌకర్యానికి గురవుతుంది.

ఏదో అనుమానంతో చూస్తుంది.కానీ అకస్మాత్తుగా కారు( Car ) ఆగిపోతుంది.

బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ఆమె ఇక్కడే ఆశ్చర్యానికి లోనవుతుంది.తనను అప్పటిదాకా వెంబడించిన ట్రక్ డ్రైవరే( Truck Driver ) ఆమె పాలిట ఊహించని రక్షకుడిగా మారతాడు మరి.

Telugu Apollo Ad, Latest, Rakhi, Rakshabandhan, Short, Truck-Latest News - Telug

భయపడొద్దు అంటూ అతగాడు ఆమెకి భరోసా ఇచ్చి… ఆమెను గమ్య స్థానానికి చేరుస్తాడు.దీనికి ప్రతిఫలంగా ఆమె డబ్బులు ఇవ్వబోతే సున్నితంగా తిరస్కరిస్తూ.నా సోదరి లాంటిదానికి వద్దు అని అంటాడు.ఆ తర్వాత తన పట్ల బాధ్యతగా వ్యవహరించిన డ్రైవర్‌కి రాఖీ( Rakhi ) కడుతుందన్న మాట ఆ యువతి.

రక్షా బంధన్‌ అంటే అందరిదీ.అపరిచితులైనా సరే.ఆపదలో ఉన్న వారి పట్ల బాధ్యతగా ఉండటం, రక్షణగా నిలబడటమే దీని ఔచిత్యం అనే సందేశంతో ఈ షార్ట్‌ ఫిలిం ముగుస్తుంది.అదిరిపోయింది కదూ!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube