పంచ ప్రసాద్ కు అండగా నిలిచిన ఏపీ సర్కార్.. త్వరలోనే సర్జరీ?

AP Sarkar Stood By Panch Prasad Details, Punch Prasad,Nooka Raju,Mamidi Harikrishna,Punch Prasad Health Update,Punch Prasad Kidneys Issue,CMO Principal Secretary Dr. Harikrishna,Letter Of Credit Apply,AP Govt,AP Govt Help To Punch Prasad

జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్(Punch Prasad) రెండు కిడ్నీలు పాడవడంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే.ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయన డయాలసిస్ చేయించుకుంటూ ఉన్నప్పటికీ తన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటనే సర్జరీ చేయాలని కమెడియన్ నూకరాజు(Nooka Raju) తన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని వివరించి తనకు ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలని కోరారు.

 Ap Sarkar Stood By Panch Prasad Details, Punch Prasad,nooka Raju,mamidi Harikr-TeluguStop.com

తనకు వెంటనే సర్జరీ జరగడం ఎంతో ముఖ్యమని వైద్యులు చెప్పినట్లు ప్రసాద్ వెల్లడించారు.ఇలా ప్రసాద్ ఆరోగ్యం గురించి తెలియజేస్తూ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక పంచ్ ప్రసాద్ కి ఎవరైనా సహాయం చేయాలి అనుకుంటే ఫోన్ పే నెంబర్ కి చేయొచ్చు అంటూ ఫోన్ పే నెంబర్ కూడా తెలియజేశారు.ఇలా ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి షేర్ చేసిన ఈ వీడియోని ఒక నేటిజన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించే డాక్టర్ మామిడి హరికృష్ణకు (Mamidi Harikrishna)ట్యాగ్ చేశారు.దీంతో ఈ విషయంపై సీఎంఓ ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరికృష్ణ స్పందిస్తూ.ఇప్పటికే తమ టీం పంచ్ ప్రసాదు కుటుంబ సభ్యులతో టచ్ లో ఉందని తెలియచేశారు.

ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి లెటర్ ఆఫ్ క్రెడిట్ అప్లై చేయడానికి ప్రయత్నాలు చేయడం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు.ఈ డాక్యుమెంట్లను పరిశీలించిన తరువాత వీలైనంత తొందరగా ఈ ప్రక్రియను పూర్తి చేయబోతున్నామని తెలిపారు.ఇలా పంచ్ ప్రసాద్ ఆరోగ్య విషయంలో ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకొని ఆయన ఆరోగ్యానికి అండగా నిలుస్తున్నామని తెలియజేయడంతో త్వరలోనే ఆయనకు సర్జరీ జరగబోతుందని ఇక ప్రసాద్ ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.డాక్యుమెంట్ పరిశీలన పూర్తి అయిన వెంటనే ప్రసాద్ కి సర్జరీ జరగబోతుందని తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube